అంతే కాదు వ్యవసాయం, ఉద్యోగం, విద్య, ఆరోగ్యం.. ఇలా ఆయన సాయం చేయని అంశం అంటూ లేదు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఎంతో మందిని ఆదుకున్న సోనూసూర్ ప్రజలకు దేవుడయ్యారు. ఏటా కోట్లాది డబ్బును సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు సోనూ. దాంతో తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలో అనేక చోట్ల సోనూసూద్ కు గుడి కూడా కట్టారు అభిమానులు.
నాగార్జునకే కండీషన్లు పెట్టిన హీరోయిన్..? ఎవరామె..? ఏ సినిమా కోసం..?
సోనూ సూద్ ద్వారా సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. కష్టం వచ్చింది అన్నవారికి లేదనకుండా..కాదనకుండా సాయం చేస్తుంటారు సోనూ సూద్. ఇక ఇంత సాయం చేస్తున్న ఆయన ఆస్తులు తరిగిపోవడంలేదా.. అసలు ఆయన ఈ సాయం ఎలా చేయగలుగుతున్నారు. ఆయన ఆస్తుల వివరాలేంటి అనేది చాలామందికి ఉన్న డౌట్. 1999లో బాలీవుడ్ సినిమా కల్లగర్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సోనూసూద్.
కమల్ హాసన్ కాదు.. ఒక్క సినిమాలో 45 పాత్రలు చేసిన నటుడు ఎవరో తెలుసా..?
బాలీవుడ్ నుంచి టాలీవుడ్. టాలీవుడ్ నుంచి కోలీవుడ్.. కన్నడ, ఇలా ఆయన సినిమా ప్రయాణం కొనసాగింది. హీరోలా ఉండే ఈస్టార్.. విలన్ పాత్రలకే పరిమితం అయ్యారు. అరుంధతి లాంటి సినిమాతో సోనూ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. కోవిడ్ సమయంలో చాలా మందికి సహాయం చేశాడు. సోనూ సూద్ తన ఛారిటీ ద్వారా చాలా మందికి సహాయం అందించాడు. ఇప్పటికీ ఆయన సాయం చేస్తూ ప్రజలను ఆడుకుంటున్నాడు.
సోనూ సూద్ ఆస్తుల విషయానికి వస్తే.. ఆయనకు 150 కోట్ల వరకూ ఆస్తులు ఉన్నట్టు అంచనా. సోనూ సూద్ సినిమాలతో పాటు పలు బిజినెస్ లు కూడా ఉన్నాయి. అంతే కాదు చాలా బ్రాండ్స్ కు ఆయన అంబాసిరడ్ గా ఉన్నాడు. ఎన్నో యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తూ. చేతినిండా సంపాదిస్తున్నారు. అంతే కాదు చాలాచోట్ల సోనూ హోటల్స్ కూడా నడిపిస్తున్నాడట. అతను నడుపుతున్న హోటళ్ల నుంచి భారీగా ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన తన ఆదాయంలో కొంత భాగాన్ని ఇలా మంచి పనులకు ఉపయోగిస్తున్నారు.
ఇక విలాసాలకు సోనూసూద్ పెద్దగా విలువ ఇవ్వరు. ఆయనకు కార్లపై పెద్దగా వ్యామోహం లేదు. ఆయన దగ్గర పోర్షా పనామెరా, బెంజ్ ఎంఎల్ క్లాస్ కార్లు ఉన్నాయి. మిగిలినవి చిన్న కార్లు. అలాగే సోనూసూద్‌కు సొంత నిర్మాణ సంస్థ ఉంది. వీటితోపాటు సోనూసూద్‌కి ముంబైలో పెద్ద ఇల్లు ఉంది. అలాగే సొంత రెస్టారెంట్ కూడా ఉంది.అలాగే ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది.. సోనూసూద్ ఒక్కో సినిమాకు 5 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సోనూసూద్ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. అభిమానుల కోరిక మేరకు.. విలన్ పాత్రలు ఆయన చేయను అని చెప్పడంతో ఈ స్టార్ కు అవకాశాలు కూడా తగ్గాయి. దాంతో అడపా దడపా సినిమాలు చేస్తూ.. తన వ్యాపారాలు.. సమాజాసేవ చేసుకుంటూ గడిపేస్తున్నాడు రియల్ హీరో.