ఈ ముగ్గురు కలిసి చదువుకోవడమే కాదు, కలిసి తినేవాళ్లు అట, ఇంట్లో చేసిన వంటకాలను, లంచ్ టైమ్‌లో షేర్ చేసుకునే వాళ్లమన్నారు సూర్య. తాను యువన్ శంకర్ రాజా ఒకేసారి సినిమాల్లోకి వచ్చామని, కలిసి పనిచేశామని తెలిపారు. ఆ తర్వాత మహేష్ సైతం సినిమాల్లోకి వచ్చారని, తాము ఇద్దరం కలిసి నటించే అవకాశం రాలేదన్నారు. కానీ మహేష్ సినిమాలన్నీ చూసి అభిప్రాయాలు చెబుతుంటాడని వెల్లడించారు సూర్య.