కొడుకులతో అనసూయకు కష్టాలు... తన వేదన వెళ్లగక్కిన మాజీ జబర్దస్త్ యాంకర్ 

Published : Jan 17, 2024, 06:45 PM IST

అనసూయకు ఇద్దరు కుమారులు. వారు చేస్తున్న పనులు కారణంగా ఆమెకు కష్టాలు తప్పడం లేదట. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అనసూయ పోస్ట్ వైరల్ అవుతుంది.   

PREV
16
కొడుకులతో అనసూయకు కష్టాలు... తన వేదన వెళ్లగక్కిన మాజీ జబర్దస్త్ యాంకర్ 


మాజీ జబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ బిజీ. ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేస్తారు. ఆమెను ఎంతగా ట్రోల్ చేసినా పట్టించుకోరు. హేటర్స్ కుళ్ళుకునే చర్యలకు పాల్పడుతూ ఉంటారు. 


 

26
Anasuya bharadwaj

అలాగే అనసూయ కుటుంబానికి చాలా విలువ ఇస్తారు. ఆమె వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ మెంబర్స్ కి టైం కేటాయిస్తారు. పండగలు, స్పెషల్ ఈవెంట్స్ అసలు మిస్ అవదు. తరచుగా విందులు, విహారాలు చేస్తారు. అనసూయ భర్త పేరు సుశాంక్ భరద్వాజ్. వీరికి ఇద్దరు అబ్బాయిలు. 

36


అనసూయ పిల్లల వయసు పదేళ్ల లోపు ఉంటుంది. వాళ్ళు స్కూల్ డేస్ లో ఉన్నారు. అయితే వీరిద్దరి వలన అనసూయకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. అదేమిటంటే... చిన్న పిల్లలు కావడంతో బట్టలు విడిచే ముందు తమ జేబులు ఖాళీ చేయడం లేదట. వాళ్ళ జేబుల్లో ఉన్న వస్తువుల కారణంగా వాషింగ్ మెషిన్ పాడవుతుందట. 

46


పిల్లలు జేబులు ఖాళీ చేయడం మరిచిపోతున్నారు. దాని వలన ప్రతి రెండు నెలలకు ఒకసారి వాషింగ్ మెషిన్ సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా ఇబ్బందిగా మారింది. మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందా? అని అభిమానులను అడిగింది. 

56

డస్ట్ బిన్ కనిపించే వరకు జేబులో వ్రాపర్ పెట్టుకునే వాళ్లంటే నాకు గొప్ప గౌరవం ఉంది అంటూ అనసూయ కామెంట్ చేసింది. అనసూయ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదన్న మాట సంగతి. 

 

66

మరోవైపు అనసూయ నటిగా బిజీగా ఉంది. ఆమె వరుస చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది అనసూయ రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాల్లో నటించారు. నెక్స్ట్ ఆమె పుష్ప  2 లో దాక్షాయణిగా సందడి చేయనుంది. 

Read more Photos on
click me!

Recommended Stories