అందుకే ఇంకా బతికున్నా, అలా చూపించి నా జీవితాన్ని ఏం చేయాలనుకున్నారు.. నాగార్జునపై సోనియా షాకింగ్ కామెంట్స్

First Published | Oct 27, 2024, 3:58 PM IST

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 8 షోపై కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వారే విమర్శలు చేస్తుండడం చర్చనీయాశం అవుతోంది. ఆరంభంలో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, తప్పకుండా ఆమె టాప్ 5 లో ఉంటుందని అంతా అనుకున్నారు. ఆమె ఎవరో కాదు 28వ రోజున ఎలిమినేట్ అయి బయటకి వచ్చేసింది సోనియా ఆకుల.

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 8 షోపై కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వారే విమర్శలు చేస్తుండడం చర్చనీయాశం అవుతోంది. ఆరంభంలో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, తప్పకుండా ఆమె టాప్ 5 లో ఉంటుందని అంతా అనుకున్నారు. ఆమె ఎవరో కాదు 28వ రోజున ఎలిమినేట్ అయి బయటకి వచ్చేసింది సోనియా ఆకుల. అనవసరమైన నెగిటివిటి కొనితెచ్చుకోవడం వల్ల సోనియా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. 

బయటకి వచ్చాక సోనియా బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన నోటికి పని చెబుతోంది. బిగ్ బాస్ హౌస్ లో సిగరెట్ లు, హగ్గులు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. నాపై నెగిటివిటి రాలేదు.. వచ్చేలా కావాలనే టార్గెట్ చేశారు. క్లారిటీ లేకుండా వాళ్ళకి కావలసిన అంశాలనే షోలో చూపించారు. పృథ్వీ, నిఖిల్ ని హగ్ చేసుకున్నది జూమ్ చేసి చూపించారు. 


Sonia Akula

అక్కడ జరిగిన సినారియో మొత్తం చూపించలేదు. నిఖిల్ హౌస్ లో అందరిని హగ్ చేసుకుంటాడు. అందులో తప్పేముంది అన్ని సోనియా ప్రశ్నించింది. ఒక అమ్మాయి.. నాకు టెన్షన్ గా ఉంది సిగరెట్ తాగుతా అని అంటుంటే.. ఎందుకు ఎప్పుడో మానేశాను అంటున్నావు.. మళ్ళీ అలాంటి అలవాటు వద్దు అని చెప్పా. ఆ మంచి పనిని చూపించలేదు. 

కొంతమంది హౌస్ లో అమ్మాయిలు సిగరెట్ తాగుతారు. వాళ్ళని నెగిటివ్ గా హైలైట్ చేయలేదు. కానీ నా క్యారెక్టర్ పైనే మచ్చ వేసే ప్రయత్నం చేశారు అంటూ సోనియా మండిపడింది. నేను చాలా సెన్సిటివ్. బయట నా క్యారెక్టర్ గురించి ఇలా అనుకుంటున్నారని నేను ఏదైనా చేసుకుని చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని సోనియా ప్రశ్నించింది. 

నాగార్జున సర్ బిగ్ బాస్ వల్ల ఏదో లైఫ్ టైం మెమొరీ అన్నట్లుగా మాట్లాడారు. ఇదేనా లైఫ్ టైం మెమొరీ అంటే.. నా జీవితాన్ని ఏం చేయాలనుకున్నారు. నా లైఫ్ కి ఒక పర్పస్ ఉందని నమ్మాను కాబట్టి ఇంకా బతికి ఉన్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాళ్ళకి కావలసిన కంటెంట్ చూపిస్తూ ఇలా చేస్తుంటే తప్పకుండా బిగ్ బాస్ వాళ్లనే నిందిస్తా అని సోనియా పేర్కొంది. 

Latest Videos

click me!