బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఈ వారం ఎలిమినేషన్‌లో కన్‌ఫ్యూజన్‌కి తెర, ఎలిమినేట్‌ అయ్యింది ఆ స్ట్రాంగ్‌ కంటెస్టెంటే?

First Published | Oct 27, 2024, 3:20 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఎనిమిదో వారం ఎలిమినేషన్‌లో కన్‌ప్యూజన్‌కి తెరపడింది. ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది తేలిపోయింది. ఆ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ ఔట్‌ అని సమాచారం. 
 

Bigg boss telugu 8

బిగ్‌ బాస్‌ తెలుగు 8 షో ఎనిమిదో వారం ఎలిమినేషన్‌కి సంబంధించి కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతూ వస్తుంది. ఈ వారం హౌజ్‌ని వీడేది ఎవరనేది సస్పెన్స్ గా మారింది. మొదట మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయ్యారనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత మరో కంటెస్టెంట్ పేరు తెరపైకి వచ్చింది. నయని పావని ఎలిమినేట్‌ అంటూ మరో రూమర్ క్రియేట్‌ చేశారు. నిన్న మొత్తం నయని పావని పేరే వినిపించింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ఇక చివరి నిమిషంలో కథ మారింది. మళ్లీ మెహబూబ్‌ ఎలిమినేషన్‌ అంటూ మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయ్యారట. ఈ వారం ఆయనే హౌజ్‌ని వీడుతున్నట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా అయిపోయిందని, మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయిపోయారని తెలుస్తుంది. ఓటింగ్‌ లో నయనిపావని, మెహబూబ్‌ వెనకబడ్డారు.

ఇద్దరి మధ్య గ్యాప్‌ చాలా తక్కువగా ఉంది. దీంతో చివరి నిమిషంలో ఎవరికి ఓట్లు ఎక్కువ వచ్చాయనేది సస్పెన్స్ నెలకొంది. అందుకే కన్‌ ఫ్యూజన్‌ నెలకొందని తెలుస్తుంది. లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు ఈ కన్‌ఫ్యూజన్‌కి తెరతీస్తూ మెహబూబ్‌ ఎలిమినేషన్‌ కన్ఫమ్‌ అని అంటున్నారు. 

Latest Videos


అయితే మెహబూబ్‌ ఎలిమినేషన్‌ అనేది షాకిస్తుంది. హౌజ్‌లో ఆయన స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్నాడు. పైగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.  రెండు వారాల క్రితమే ఆయన హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. టాస్క్ లో తన బెస్ట్ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు మెగా చీఫ్‌ కూడా అయ్యాడు. దీంతో మెహబూబ్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆయన ఎలిమినేషన్‌ అనే వార్త ఆశ్చర్యపరుస్తుంది. మరి మెహబూబ్‌ ఎలిమినేషన్‌కి కారణాలేంటి? ఆయనకు ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయనేది చూస్తే.. 
 

మెహబూబ్‌ టాస్క్ ల్లో ది బెస్ట్ ఇస్తున్నాడు. గేమ్‌లు బాగా ఆడుతున్నాడు, కానీ ఎలా ఎలిమినేట్‌ అయ్యారనేది ఆశ్చర్యంగా మారింది. అయితే ఆయన టాస్క్ ల్లో యాక్టివ్‌గా ఉన్నాడు, కానీ కంటెంట్‌ ఇవ్వలేకపోతున్నాడు. కెమెరాల్లో హైలైట్‌ అయ్యేలా ఆయన ఉండటం లేదు. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో టాస్క్ లు మాత్రమే కాదు, హైలైట్‌ అయ్యేలా కూడా ఉంది. మాటలు కానీ, ఫన్ గానీ ఉండాలి. పైగా అందరితో కలివిడిగా ఉండాలి.

కానీ మెహబూబ్‌ అలా ఉండలేకపోతున్నాడు. ఆడితే ఆటలు, లేదంటే నబీల్‌తో అన్నట్టుగా మారింది. చాల వరకు పాత కంటెస్టెంట్లతోనే కలుస్తున్నాడు తప్ప, కొత్త వారితో ఫ్రీగా మూవ్‌ కావడం లేదు. కంటెంట్ ఇచ్చేలా వ్యవహరించడం లేదు, ఇవన్నీ ఆయనకు ఓటింగ్‌ తగ్గడంలో కీలక భూమిక పోషించాయని చెప్పొచ్చు. 
 

మరోవైపు గత వారం ఆయన కమ్యూనిటీ గురించి మాట్లాడాడు. నబీల్‌తో కలిసి మనకు కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయంటూ కామెంట్‌ చేశాడు. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఇలాంటి చర్చ జరగడం ఇదే ఫస్ట్ టైమ్‌. దీనిపై ఆడియెన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. బిగ్‌ బాస్‌ షోకి రకరకాల వ్యక్తులు వస్తారు. విభిన్న రంగాల నుంచి వస్తారు. అందరు ఇందులో సమానం.

కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి, కనీస నైతికత పాటించకుండా కమ్యూనిటీకి సంబంధించిన చర్చ లేవనెత్తడం పెద్ద మైనస్‌గా మారింది. ఆయనకు అది పెద్ద ఎఫెక్ట్ అయ్యిందని సమాచారం. ఈ వారం ఆయన్ని ఎలిమినేట్‌ చేయడంలో ఈ విషయం కూడా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. పైగా నబీల్‌కి మాత్రమే గేమ్‌ లో సలహాలు, ప్లానింగ్‌ ఇస్తున్నాడు, మిగిలిన వారితో అంత ఫ్రీగా ఉండటం లేదు. ఆడితే టాస్క్ లు లేదంటే, తనకు కంఫర్ట్ ఉన్నవారితోనే ఉంటున్నాడు, పెద్దగా హడావుడి లేదు.

హౌజ్‌లో ఎప్పుడూ ఏదో రకంగా కంటెంట్‌ ఇవ్వాలి, లేదంటే ఆడియెన్స్ పట్టించుకోరు, బిగ్‌ బాస్‌ అసలే పట్టించుకోరు. ఇప్పటికే రేటింగ్‌ తక్కువగా వస్తుందని చెప్పి నిర్వాహకులు బాధపడుతున్నారు. దీనికితోడు ఇలా కంటెస్టెంట్లు వ్యవహరిస్తే ఏమాత్రం ఎంకరేజ్‌ చేయరు. మెహబూబ్‌ విషయంలో అదే జరిగినట్టు తెలుస్తుంది. అందుకే ఎలిమినేషన్‌లో ఈ కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ అయ్యిందని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

read more: బాలయ్య బాబాయ్‌తో కాదు, ఆయనతోనే సినిమా చేస్తా.. ఎన్టీఆర్‌ బోల్డ్ రియాక్షన్‌

click me!