సోనమ్ పేర్లు చెప్పకపోయినా, "ఏడుగురు తోబుట్టువులు" అన్న మాటతో కత్రినా కైఫ్ గురించేనా అని నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది. సోనమ్ ఉద్దేశపూర్వకంగానే ఈ విషయం చెప్పిందా అని ప్రశ్నిస్తున్నారు.వేధింపుల గురించి తాను బహిరంగంగా మాట్లాడి తన కెరీర్ పాడు చేసుకోదలుచుకోలేదని, తాను తన 7 గురు తోబుట్టువుల బాగోగులు చూసుకోవాలని కత్రినా సోనమ్ కి చెప్పినట్లు ఆమె పరోక్షంగా తెలిపారు.
సోనమ్ తన స్నేహితురాలి గుర్తింపును పరోక్షంగా వెల్లడించినందుకు కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు ఆమె వర్ణనతో అది ఎవరో సులభంగా ఊహించవచ్చని హాస్యంగా వ్యాఖ్యానించారు.