అయితే కంటెస్టెంట్లకి సంబంధించిన వార్తలే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎవరు వస్తారనేది మాత్రం సస్పెన్స్. ఊహాగానాలు మాత్రం చాలానే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న వారిలో యాంకర్ వింధ్యా, విష్ణు ప్రియా, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివ, యాంకర్ నిఖిల్, బంచిక్ బబ్లూ, సుప్రీత, అమర్ దీప్ భార్య తేజూ, సీనియర్ హీరోయిన్ దీపికా, శ్వేతా నాయుడు, సీరియల్ నటుడు ఇంద్రనీల్, కమెడియన్ సద్దాం, యాదమ్మ రాజు, కుషితా కల్లాపు, రీతూచౌదరి, కిర్రాక్ ఆర్పీ, మై వీలేజ్ షో అనిల్, సాయికిరణ్, నటి సనా, శీతల్ గౌతమ్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితోపాటు వినోద్ కుమార్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఇందులో ఎవరు వస్తారనేది సస్పెన్స్ గా మారింది.