సహజీవనం చేస్తుండగానే తమ రిలేషన్ ని నరేష్, పవిత్ర అఫీషియల్ గా గత ఏడాది ప్రకటించారు. ఇది కాస్త రమ్య రఘుపతితో తీవ్ర వివాదం అయింది. అయితే నరేష్, పవిత్ర నిజంగానే వివాహం చేసుకున్నారా లేక సహజీవనం కొనసాగిస్తున్నారా అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి వీరిద్దరి బంధం మాత్రం అఫీషియల్. నరేష్ వయసు 64 ఏళ్ళు కాగా.. పవిత్ర వయసు 44 ఏళ్ళు. పవిత్ర లోకేష్ సౌత్ లో తల్లి, వదిన, అత్త తరహా క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. పవిత్ర లోకేష్ కి ఆల్రెడీ వివాహం జరిగి విడాకులు కూడా అయ్యాయి. ఆమె మాజీ భర్త పేరు సుచేంద్ర ప్రసాద్. ఇటీవల సుచేంద్ర ప్రసాద్.. పవిత్ర లోకేష్, నరేష్ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.