ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. మెగా సాంమ్రాజ్యాన్ని విస్తరించిన చిరంజీవి.. ఇండస్ట్రీలో కపూర్ ఫ్యామిలీ ని మించిపోయిన సినిమా కుటుంబంగా ఎదిగారు. ఆయన ఫ్యామిలీ నుంచి నలుగురు పాన్ ఇండియా స్టార్లు.. నలుగురు టాలీవుడ్ స్టార్లు.. నిర్మాణ సంస్థలు, అనేక రకాల బిజినెస్ లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రత్యేక సినిమా ప్రపంచాన్ని సృష్టించారు చిరు.