సినిమా ఆఫర్ అని చెప్పి ఎంత వల్గర్ గా అడిగాడో తెలుసా, నా భర్తకి స్పీకర్ లో వినిపించా..సుష్మ భూపతి కామెంట్స్

Published : Nov 17, 2025, 11:39 AM IST

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సుష్మ భూపతి ఇంస్టాగ్రామ్ వీడియోలతో ఫేమస్ అయ్యారు. ఆమెకి ఓ మూవీలో ఆఫర్ వచ్చిందట. కానీ అతడు ఫోన్ చేసి అసభ్యంగా కమిట్మెంట్ అడిగినట్లు సుష్మ పేర్కొంది. 

PREV
15
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సుష్మ భూపతి  

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్  సుష్మ భూపతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఆమె రీల్స్  ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంస్టాగ్రామ్ లో ఆమెకి 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె చేసే ప్రతి రీల్ క్షణాల్లో వైరల్ అవుతుంది అంటే సుష్మ భూపతి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

25
సుష్మ భూపతిపై ట్రోలింగ్ 

పాపులారిటీ వచ్చిన తర్వాత సుష్మ భూపతి సంపాదన బాగా పెరిగింది. సరదాగా వినాయక చవితికి చేసిన ఒక వీడియో వైరల్ కావడంతో అప్పటి నుంచి సుష్మ ఇన్స్టా రీల్స్ ప్రారంభించింది. సుష్మ భూపతి వల్గర్ గా డ్యాన్స్ చేస్తుంది అనే విమర్శలు ఉనప్పటికీ ఆమె వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తన డ్యాన్స్ గురించి సుష్మ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నా వీడియోలు చూసి ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు ? ఏం మాట్లాడుకుంటున్నారు అనేది నాకు అనవసరం. నేను ఇన్స్టాలో ఎంటర్టైన్ చేయడానికి రీల్స్ చేస్తున్నా. ఎంటర్టైన్మెంట్ అంటే ఇలానే ఉంటుంది. 

35
స్విమ్మింగ్ పూల్ వీడియో వైరల్ 

దీని ద్వారా నాకు ఓ ఆదయ మార్గం దొరికింది. నేను కష్టాల్లో ఉప్పుడు నా కొడుకు చిరిగిన చొక్కాతో స్కూల్ కి వెళ్ళేవాడు. ఇన్స్టా రీల్స్ వల్ల ఆ పరిస్థితి మారింది. నేను నా భర్త పిల్లలు హ్యాపీగా ఉన్నాం అని సుష్మ భూపతి పేర్కొంది. సుష్మ భూపతి కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది. స్విమ్మింగ్ పూల్ లో పొట్టి బట్టలు వేసుకుని చేసిన వీడియోపై దారుణమైన విమర్శలు వచ్చాయి. 

45
సుష్మ భూపతి వివాదం 

స్విమ్మింగ్ పూల్ వీడియో ఒక్కటీ పెట్టకుండా ఉండాల్సింది అని సుష్మ భూపతి తెలిపింది. ఆ వీడియోపై చాలా వల్గర్ గా అందరూ కామెంట్స్ చేసినట్లు పేర్కొంది. మరో వివాదం ఏంటంటే .. ఆమె హెచ్ సి యు భూములపై చేసిన ప్రమోషనల్ వీడియో తీవ్ర విమర్శలకు దారి తీసింది. సుష్మ డబ్బు కోసం ఏమైనా ఏమైనా చేస్తుంది అంటూ అంతా ట్రోల్ చేశారు. ఆ వీడియో తనకి ఏమాత్రం అవగాహన లేకుండా చేశానని ఆ తర్వాత సుష్మ క్షమాపణలు కోరింది. 

55
సినిమా ఆఫర్ అంటూ కమిట్మెంట్ అడిగాడు 

సుష్మ ప్రమోషన్ వీడియోలతో లక్షల్లో ఆదాయం పొందుతోంది. ఆమెకి నెలకు 5 నుంచి 6 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు పేర్కొంది. తన సొంత ఇల్లు కల నెరవేరిన తర్వాత ఇన్స్టా రీల్స్, గ్లామర్ వీడియోలు చేయడం ఆపేస్తానని సుష్మ పేర్కొంది. అనేక టీవీ షోలలో కూడా సుష్మ పాల్గొంది. సినిమా అవకాశాల గురించి మాట్లాడుతూ తాను ఓ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించానని తెలిపింది. మరో వ్యక్తి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు. నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాను. ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా నేను స్పీకర్ ఆన్ లో పెట్టే మాట్లాడతాను. మా ఇంట్లో వాళ్ళందరూ వింటారు. నా దగ్గర సీక్రెట్స్ ఏమీ ఉండవు. అతను మాట్లాడుతూ సినిమా ఆఫర్ ఉంది అని చెప్పారు. నేను ఓకె అన్నాను. కాకపోతే కొన్ని అడ్జెస్ట్ కావలసినవి ఉంటాయి అని అన్నాడు. పదే పదే ఆ మాట చెబుతున్నాడు. నా బుర్రకి మీరు చెప్పేది అర్థం కావడం లేదు అని చెప్పా. దీనితో కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని వల్గర్ గా అడిగాడు.. కుదరదు సారీ అని చెప్పి ఫోన్ పెట్టేసినట్లు సుష్మ భూపతి పేర్కొంది. 

Read more Photos on
click me!

Recommended Stories