హాట్ టాపిక్:  ఫ్యామిలీ స్టార్  ప్లాప్...  పండగ చేసుకుంటున్న నాగ చైతన్య, అల్లు అరవింద్..!

Published : Apr 05, 2024, 02:11 PM IST

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. అయితే ఫ్యామిలీ స్టార్ ప్లాప్ ని హీరో నాగ చైతన్య, అల్లు అరవింద్ ఎంజాయ్ చేస్తున్నారట. దీని వెనకున్న కారణం ఏమిటో చూద్దాం...   

PREV
18
హాట్ టాపిక్:  ఫ్యామిలీ స్టార్  ప్లాప్...  పండగ చేసుకుంటున్న నాగ చైతన్య, అల్లు అరవింద్..!


దర్శకుడు పరశురామ్ కెరీర్లో గీత గోవిందం బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రంలో హీరో హీరోయిన్ గా నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందాన స్టార్స్ అయ్యారు. వారికి భారీ ఫాలోయింగ్ తెచ్చి పెట్టిన చిత్రం అది. పరశురామ్ తో విజయ్ దేవరకొండ చేసిన రెండో చిత్రం ఫ్యామిలీ స్టార్. 
 

28
Family Star Review

ఫ్యామిలీ స్టార్ చిత్తాన్ని ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. విజయ్ కి జంటగా మృణాల్ ఠాకూర్ నటించింది. ట్రైలర్ ఆకట్టుకోగా ఫ్యామిలీ స్టార్ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలంగా హిట్ లేక అల్లాడుతున్న విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. 
 

38
Family Star Review


తీరా చూస్తేఫస్ట్ షో నుండే ఫ్యామిలీ స్టార్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు పరశురామ్ కథ, కథనాలు లేకుండా రొటీన్ స్టోరీతో ఒక సీరియల్ తీశాడని అంటున్నారు. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ సినిమాకు ఇంత దారుణమైన టాక్ రాలేదు. 
 

48
Family Star

కాగా ఫ్యామిలీ స్టార్ ప్లాప్ అని ప్రచారం జరుగుతుండగా.. అల్లు అరవింద్, నాగ చైతన్య ఫుల్ హ్యాపీ అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్ట్స్ దర్శనం ఇస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ ప్లాప్ అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని పరిశీలిస్తే... 
 

58
Allu Aravind

దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని నాగ చైతన్య హీరోగా, అల్లు అరవింద్ బ్యానర్ లో చేయాల్సింది. గీత గోవిందం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కింది. ఆ సినిమా హిట్ కాగా మరో మూవీ తన బ్యానర్ లో చేయాలని పరశురామ్ కి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చాడు. 
 

68
Family Star

నాగ చైతన్య-పరశురామ్-అల్లు అరవింద్ కాంబోలో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. వారిద్దరికీ హ్యాండ్ ఇచ్చిన పరశురామ్.. దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఆగ్రహానికి గురైన అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి పరశురామ్ ని కడిగేయాలి అనుకున్నాడు.
 

78
Naga Chaitanya

పరశురామ్ భార్యతో పాటు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి సారీ చెప్పి బ్రతిమిలాడటంతో ఆయన మెత్తబడ్డారు. నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో... పరశురామ్ నా టైం వేస్ట్ చేశాడు. ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్ అని ఘాటు కామెంట్స్ చేశాడు. 
 

88
Family Star Review

పరశురామ్ భార్యతో పాటు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి సారీ చెప్పి బ్రతిమిలాడటంతో ఆయన మెత్తబడ్డారు. నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో... పరశురామ్ నా టైం వేస్ట్ చేశాడు. ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్ అని ఘాటు కామెంట్స్ చేశాడు. 
 

Read more Photos on
click me!

Recommended Stories