విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” రివ్యూ

First Published | Apr 5, 2024, 12:24 PM IST


 
ఫ్యామిలీ, మాస్‌ యాక్షన్‌ అంశాలతో తెరకెక్కిన  ఈ చిత్రం  విజయ్‌ దేవరకొండ కు ఖచ్చితమైన హిట్ ఇవ్వాల్సిన టైమ్ లో వచ్చింది. అయితే ఎంతవరకూ అతని అవసరాన్ని తీర్చి నమ్మకాన్ని నిలబెట్టింది?
 

Family Star


'ఐరనే వంచాలా ఏంటి?' అంటూ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గా మన ముందుకు వచ్చారు. దిల్ రాజు బ్యానర్ అంటే  ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ కాబట్టి ఆ ట్రెడిషన్ ని కొనసాగిస్తున్న రీతిలో ఈ ఫిల్మ్ ని రూపొందించారు. అయితే క్రైమ్ థ్రిల్లర్స్ ఓటిటిలకు షిప్ట్ అయ్యినట్లుగా  ఫ్యామిలీ కథలు  టీవీ సీరియల్స్  వెళ్లిపోయాయి. అలాంటప్పుడు అంతకు మించి ఉంటేనే తెరపై ఫ్యామిలీ స్టోరీలను ఆదరిస్తారు. ఓ రకంగా రిస్కే అయ్యినా విజయ్ దేవరకొండ దాన్ని ధైర్యంగా స్వీకరించి చేసారు. విజయ్ చాలా హోప్స్ పెట్టుకున్న ఈ చిత్రం ఆయన్ని ఫ్లాఫ్ ల నుంచి బయిటపడేసిందా? ఫ్యామిలీ స్టార్ గా మనందరినీ మెప్పించాడా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 


స్టోరీ లైన్: 


 మిడిల్ క్లాస్ కుర్రాడు 'గోవర్ధన్'(Govardhan)కి ఫ్యామిలీ అంటే ప్రాణం. ఆర్కిటెక్ట్ అయిన అతను ఓ  కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తూ  కుటుంబ బాధ్యతలు అన్నీ తన భుజాల మీదే మోస్తూ ఉంటాడు. ఇంట్లో తనే ఆర్దిక ఆధారం. ఓ ప్రక్కన తాగుడుకు బానిసైన ఒక అన్న(రవి ప్రకాష్) మరో ప్రక్క ఎప్పుడూ ఏదో బిజినెస్ పెట్టుబడి అంటూ  తిరిగే మరో అన్న (రాజా చెంబోలు) కు ఆదాయాలు లేకపోవటంతో వాళ్ల ఫ్యామిలీలను తనే సాకాల్సిన పరిస్దితి. ఇలా తను,తన కుటుంబం, ఉద్యోగం అంటూ వెళ్తున్న గోవర్ధన్ జీవితంలోకి  ఇందు (మృణాల్ ఠాకూర్) అనే డబ్బున్న అమ్మాయి వస్తుంది. ఆమె అతను ఇంట్లోకి అద్దెకు దిగుతుంది.  సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేసే ఆమె వచ్చాక జీవితం మారిపోతుంది. మెదట్లో ఆమెను పట్టించుకోకపోయినా మెల్లిగా ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే   ప్రేమ ప్రపోజల్ పెట్టే టైమ్ కు ఆమె మన హీరో గోవర్దన్ ఓ ట్విస్ట్ లాంటి షాక్ ఇస్తుంది. ఆ షాక్ ఏంటి..అప్పుడు  గోవర్ధన్ ఏం చేశాడు?  వాళ్ల ప్రేమ కథ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Family Star Review

ఎనాలసిస్ ..


సినిమా హిట్ అవ్వాలంటే కథే బాగుండాలా ఏంటి? అనుకుని చేసినట్లున్న ఈ సినిమా కథాంశం  తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే  . అయితే దాన్ని ఎంత స్మూత్ గా, ఎంత అందంగా చెప్పారనేదానిపై సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. పరుశురామ్ దర్శకుడుగా అద్బుతం తీయకపోవచ్చు కానీ డిజప్పాయింట్ చేయరనిపిస్తారు. అయితే #FamilyStar సినిమాకు ఎంచుకున్న కథ ఆయనకు కలిసి రాలేదు. గీతాగోవిందం టెంప్లేట్ ని రిపీట్ చేద్దామని ప్రయత్నించారు. అయితే అంత ఈజీ టాస్క్ కాదు. హీరోను, నిర్మాతను ఈ ఫార్మెట్ తో ఒప్పించవచ్చు కానీ ప్రేక్షకుడుని ఒప్పించి మెప్పించటం  చాలా కష్టం. అయినా ఒకసారి జరిగిన మ్యాజిక్ మరోసారి జరుగుతుందని ఆశించటం అత్యాశే. తనమీద తనకే కాన్ఫిడెన్స్ తగ్గించే అనిపించేలా అమెరికాలో వచ్చే సీన్స్ ఉంటాయి. 

Family Star Review


న్యూయార్క్ టైమ్ స్కేర్ దగ్గర  విజయ్ దేవరకొండను ప్రాసిట్యూట్ అనుకుని అక్కడ అమెరికన్ అమ్మాయిలు ఎటాక్ చేయటం అయితే నవ్వుకోవటానికి పెట్టారో లేక హీరోయిజం ఎలివేషన్ కు పెట్టారో కానీ దణ్ణంరా దొర అనాలనిపిస్తుంది. యుస్ లో బాగా వర్కవుట్ అవ్వాలని,అక్కడ మనవాళ్లకు కనెక్ట్ కావాలని దాదాపు సెకండాఫ్ మొత్తం అమెరికాలో నడిపారు. ఎందుకనో మినిమం బేసిక్ లాజిక్స్ ...మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అనే ఒకే ఒక కారణం చూపెడుతూ వదిలేసారు. మరీ ముఖ్యంగా హీరో  ఇంట్లో అన్న తాగుడికి బానిస అవటానికి కారణం చాలా చిన్నగా ,పెద్ద లాజిక్ గా అనిపించదు. అలాగే హీరోయిన్ క్యారక్టర్ కూడా బిలివబులిటీ రాదు.

Family Star Review


కథలో కొంచెం చిరంజీవి (Chiranjeevi) ‘గ్యాంగ్ లీడర్’ (Gangleader)  పోలికలు ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా రాసుకుంటే బాగుండేది. కానీ   స్క్రీన్ ప్లే చాలా బద్దకంగా కునుకు తీస్తూ నడుస్తున్నట్లు ఉంటుంది.   కథను నడపటానికి ఎంచుకున్న బ్రదర్, హీరోయిన్ రెండు కాంప్లిక్ట్స్ లు బలంగా లేవు. ఫస్ట్ హాఫ్  సెటప్ సాగినట్లున్నా, కొన్ని ఫన్నీ డైలాగులుతో నడిచిపోయింది. సెకండాఫ్ లో అదరకొట్టేస్తారు..అసలు విషయం అక్కడుందనుకుంటాము. కానీ ఇంట్రవెల్ అయ్యిన కాసేపటకే అంత సీన్ లేదని డైరక్టర్ మనని వెక్కరిస్తారు. 
 

Family Star Review


 అక్కడ పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ మీద డిపెంట్ అయ్యారు కానీ అవి చాలా సార్లు చూసేసినవే కావటంతో డేజావులా ఇంతకు ముందే చూసిసినట్లు అనిపిస్తూంటాయి. కామెడీ కూడా గీతా గోవిదం తరహాలో వర్కవుట్ కాలేదు. అక్కడక్కడా కొన్ని మెరుపులు మెరిసినా ప్లాట్ స్ట్రాంగ్ గా లేకపోవటంతో తేలిపోయాయి. థియేటర్ నుంచి బయిటకు వచ్చాక ఏం చూసాము అంటే గుర్తుకు వచ్చే పరిస్దితి లేదు.  ఇది  rom-com అంటే అదీ పూర్తిగా చెప్పలేం.   టెంప్లేట్ లో వెళ్తున్నట్లు అనిపిస్తుంది కానీ ఎమోషన్ కనెక్షన్స్ ఇవ్వకపోవటంతో మంచి మూవ్ మెంట్స్ కూడా రిజిస్టర్ అయ్యే పరిస్దితి లేదు.  
 

Family Star Review

 టెక్నికల్ గా ...

ఇలాంటి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు ఫెరఫెక్ట్ అనిపించే గోపీసుందర్ ని సంగీతానికి ఎంచుకున్నారు. కానీ ఎకస్పెక్ట్ చేసిన స్దాయిలో అయితే మ్యూజిక్ మేజిక్ చెయ్యలేదు. గీతా గోవిందం చిత్రానికి పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి. ఈ సారి ఈ డిపార్టమెంటే దెబ్బ కొట్టింది. ఇక సినమాటోగ్రఫీ ..బాగుంది. కొన్ని విజువల్స్ ఫ్రెష్ గా ఉన్నాయి. మార్తాండ్ కే. వెంకటేష్ ఎడిటింగ్ కూడా కొన్ని ల్యాగ్ ని సరిచేసి పరుగెత్తించలేకపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. పరుశురామ్ మొదటి నుంచి డైలాగ్స్ లో తన స్పెషాలిటీ చూపెడుతున్నారు. ఈ సారి కొన్ని బాగా పేలాయి. నో బడి కెన్ స్టాప్ విత్ దైర్  కుట్రాస్ అండ్ కుతంత్రమ్స్ వంటివి తెలిసినట్లుగా అనిపించేవే అయినా సందర్బాన్ని బట్టి బాగానే వర్కవుట్ అయ్యాయి. 

Family Star Review


నటీనటుల్లో ..

నటుడుగా విజయ్ దేవరకొండకు ఇది కీలకసమయం. ఇలాంటి కంపర్ట్ జోన్ కథలు సీనియర్ హీరోలకు వదిలేయాలి. అలాగే పెద్దగా ఇంపార్ట్ కలగచేయని ఇలాంటి టెంప్లేట్ కథలకు స్వస్ది చెప్పాలి. లేకపోతే ఎంత బాగా చేసినా సీన్స్, కథ సహకరించక సక్సెస్ దూరంగా నిలబడి దోబూచులాడుతుంది. ఇలాంటి సినిమాలు బాగున్నాయి అని చెప్పలేం. భలే ఉంది వెంటనే చూడాలి అని చెప్పలేని పరిస్దితి క్రియేట్ చేస్తాయి. అయితే అదే సమయంలో ఒక విషయం చెప్పాలి..మిడిల్ క్లాస్ కుర్రాడుగా ఫెరఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు. ఇందుగా మృణాలి ఠాకూర్.. చూడ్డానికి బాగుంది. అయితే క్యారక్టరైజేషన్ అంతగొప్పగా లేదు. సీనియర్ యాక్టర్ జగపతిబాబు రొటీన్ పాత్రలో అలా కనిపించి ఇలావెళ్లిపోయారు. వెన్నెల కిషోర్ కమిడియన్ గా కాసేపు నవ్వించారు.   బామ్మ పాత్రలో మరాఠీ రోహిణి సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మరోసారి కనిపించి ఆకట్టుకుంది.

Family Star Review


బాగున్నవి

విజయ్ దేవరకొండ ఫెరఫార్మెన్స్
ప్రొడక్షన్ వాల్యూస్
లీడ్ పెయిర్ కెమెస్ట్రీ
మంచి మెసేజ్  
కొన్ని డైలాగులు
 

Family Star Review


బాగోలేనివి 
ఈ కథకు అవసమైన ఎమోషన్ డెప్త్ లేకపోవటం
ఓవర్ అనిపించిన అమెరికా ఎపిసోడ్
 ఎనభైల నాటి కథ,కథనం
సరైన కాంప్లిక్ట్ లేకపోవటం 

Family Star Review

ఫైనల్ టాక్


 రొటీన్ ఫ్యామిలీ కథలలో స్టార్స్ నటించినా అంతంత మాత్రమే ఇంపాక్ట్ ఇస్తుందని మరోసారి రుజువైంది. ఫ్యామిలీలను టార్గెట్ చేసినట్లున్న ఈ సినిమా యూత్ కు ఏ మేరకు ఎక్కుతుందనే దానిపై సక్సెస్ రేటు ఆధారపడి ఉంటుంది. 
Rating:2.5
--- సూర్య ప్రకాష్ జోశ్యుల

Family Star Review


 నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతిబాబు, రోహిణి, వెన్నెల కిషోర్,  తదితరులు
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల
విడుదల తేదీ 05, ఏప్రియల్ 2024.
 

Latest Videos

click me!