సమంతను మర్చిపోలేకపోతున్న నాగచైతన్య... ఏం చేశాడో తెలుసా..?

First Published | Aug 9, 2024, 10:08 PM IST

విడాకులు తీసుకున్నాక కూడా సమంతను మర్చిపోలేకపోతున్నట్టున్నాడు నాగచైతన్య. విడాకులు తీసుకుని మూడేళ్లు అవుతున్నా ఇంకా  ఆమె జ్ఞాపకాలు కొన్నింటిని పదిలంగా దాచుకున్నారు..? 

టాలీవుడ్ లో ఒకప్పుడు క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు నాగచైతన్య- సమంత. చాలా కాలం ప్రేమించి పెళ్ళాడిన వీరు.. నాలుగేళ్లు నిండకుండానే మనస్పర్ధలతో విడిపోయారు. అందమైన జంటగా అభిమానులు ముచ్చటపడిన వీరు.. విడాకుల వార్తలతో అందరికి షాక్ ఇచ్చారు. 2017లో పెళ్లి చేసుకొని.. నాలుగేళ్ల వివాహ బంధాన్ని 2021లో ముగించారు. 

ఇక విడాకులు తీసుకున్న మూడేళ్లకు నాగచైతన్య మరోపెళ్ళికి సిధ్దం అయ్యాడు. చాలా రోజులుగా హీరోయిన్ శోభిత దూళిపాళతో సీక్రేట్ రిలేషన్ మెయింటేన్ చేసిన చైతూ.. అందరి అనుమానం నిజం చేస్తూ.. తాజాగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ గా వీరి నిశ్చితార్దం జరిగింది. కాగా పెళ్ళి డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


కాగా నాగచైతన్య సమంత నుంచి విడాకులు తీసుకున్నా.. శోభితతో ఎంగేజ్మెంట్ జరిగినా కూడా.. సమంతను ఇంకా  నాగచైతన్య మర్చిపోలేక పోతున్నాడు అని అంటున్నాడు అభిమానులు. ఈ జంట విడిపోయిన తర్వాత, చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి సమంతతో  ఉన్న అన్ని ఫోటోలను  డిలేట్ చేశాడు. కాని ఒక్క మజిలీ సినిమా పోస్టర్ మాత్రం ఉంచాడు.అయితే ఇది కూడా పెద్ద విషయం కాదు కాని.. ఒక్క ఫోటో మాత్రం చైతు తీయలేదు. 

Naga Chaitanya

అందేంటంటే.. ఇద్దరు ఓ రేస్ కారు పక్కన నిలబడి ఉన్న స్నాప్‌షాట్, దీనిని చైతన్య 2018లో పోస్ట్ చేసారు, త్రో బ్యాక్… మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్  అని ఈ ఫోటోకు క్యాప్షన్ పెట్టి ఉంది. ఈ ఫోటో చాలా క్యూట్ గా కూడా ఉంది. అయితే ఈపోటో చైతూ డిలెట్ చేయకపోవడానికి కారణం ఏంటీ అని  ఫ్యాన్స్ అంతా ఆలోచనలో పడ్డారు. ఎంతైనా.. ఏడెనిమిదేళ్లు ప్రేమించి.. మూడేళ్లు కాపురం చేసిన వ్యక్తి కావడంతో.. చైతూ సమంతను మర్చిపోలేకపోతున్నాడు అని అంటున్నారు. 

Latest Videos

click me!