అభినవ్ గోమఠం , వైశాలి రాజ్, అలీ రెజా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించారు. ఆరెం రెడ్డి, ప్రశాంత్.వి, భవాని కాసుల సంయుుక్తంగా కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద ఈ మూవీని నిర్మించారు.ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయిన ఈమూవీ.. మార్చ్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతూ 100 ప్లస్ మిలియన్ రియల్ టైం వ్యుయింగ్ మినిట్స్‌తో దూసుకుపోయింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.