66 ఏళ్ల ఓల్డ్ హీరోలతో శోభిత ధూళిపాళ రొమాన్స్.. లిప్ లాక్ తో రెచ్చిపోయిన తెలుగు బ్యూటీ.. మండిపడుతున్న ఫ్యాన్స్

Published : Feb 21, 2023, 09:49 PM IST

బాలీవుడ్ లో రచ్చ రచ్చ చేస్తోంది తెలుగు పిల్ల శోభిత ధూళిపాళ. బొల్డ్ సీన్స్ తో రెచ్చిపోతోంది. అది కూడా ఏ యంగ్ హీరోతోనే కాదు 66 ఏళ్ళ సీనియర్ హీరోతో..?   

PREV
16
66 ఏళ్ల ఓల్డ్ హీరోలతో శోభిత ధూళిపాళ రొమాన్స్.. లిప్ లాక్ తో రెచ్చిపోయిన తెలుగు బ్యూటీ.. మండిపడుతున్న ఫ్యాన్స్

అచ్చ తెలుగు ఆడపిల్ల శోభిత ధూళిపాళ.  బాలీవుడ్ తెరపై హీరోయిన్ గా వెలుగుతోంది. వరుస సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేసుకుంటూ రెచ్చిపోతోంది. ఇటు సౌత్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది శోభిత. కాని ఎక్కువగా బాలీవుడ్ పైనే దృష్టి పెట్టింది. బోల్డ్ సీన్స్.. లిప్ లాక్స్ అంటే ఏమాత్రం తగ్గడంలేదు తెనాలి అమ్మాయి. 

26

ఈ మధ్య అక్కినేని హీరో నాగచైతన్యతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది బ్యూటీ. చైతూని పెళ్ళాడబోతుంది అని రూమర్ కూడా గట్టిగా వినిపించింది. కాని ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అనౌన్స్ మెంట్ వినిపించలేదు. ఈక్రమంలో.. నాగచైతన్యప్లాట్ ముందు శోభిత కారు ఉండటంతో.. ఆడియన్స్ వీరి రిలేషన్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట రకరకాల పోస్ట్ లు కూడా వెలిశాయి.
 

36

తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి సినిమాలు చేసిన శోభిత.. బాలీవుడ్ లో మాత్రం రెచ్చిపోతోంది. ఇప్పటి వరకూ ఆమె బాలీవుడ్ లో  దాదాపుగా బోల్డ్  పాత్రలే చేస్తూ వస్తోంది. ఇక ఈ క్రమంలోనే శోభిత రీసెంట్ గా  మరింతగా రెచ్చిపోయింది. ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ  బ్యూటీ. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 

46

ఈ సిరీస్ లో హాట్ డోస్ పెంచింది శోభిత. ఈ వెబ్ సిరీస్ లో హాట్ కిస్సులతో రెచ్చిపోయింది. అది కూడా ఏ కుర్ర  హీరోతోనో కానే కాదు.  30 ఏళ్ళ శోభిత 66 ఏళ్ల  బాలీవుడ్ సీనియర్  స్టార్ హీరో  అనీల్ కపూర్ తో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. దాంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. అంతే కాదు పలు విమర్షలకు కూడా దారితీస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో ఆమెను కేవలం ముద్దుల కోసమే తీసుకున్నా..  బికినీ వేసుకుని రొమాంటిక్ సీన్స్ కోసమే ఆమెను తీసుకున్నారా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

56

 నాలుగు ఎపిసొడ్స్ ఉన్న ఈ ఫస్ట్ సీజన్ వెబ్ సిరీస్ లో శోభిత పాత్రకు ఎక్కువగా యాక్టింగ్ స్కోప్ లేదు. అయితే అవకాశాలు లేక ఈ బ్యూటీ ఈ పని చేసిందంటున్నారు జనాలు.  అవకాశాలు లేనంత మాత్రాన మరీ 66 ఏళ్ల ముసలాడితో లిప్ లాక్ సీన్స్ చేయడం ఏంటీ అని నెటిజన్లు మండిపడుతున్నారు. 
 

66

శోభితకు ఇప్పటికే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా సౌత్ నుంచి  శోభిత ధూళిపాల పొన్నియిన్ సెల్వన్ 1లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఓటీటీ మూవీలకు శోభిత కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 లో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. మరి 30 ఏళ్ల శోభిత.. 66 ఏళ్ల వ్యక్తితో రోమాన్స్ చెయ్యడంపై రచ్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. 
 

click me!

Recommended Stories