బాలీవుడ్ కింగ్ ఖాన్, సీనియర్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’ (Pathaan). గత నెల 25 గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం రిలీజ్ కు ముందు మాత్రం చాలా విమర్శలు, బాయ్ కాట్ బారినపడి ఇబ్బందులకు గురైంది. అయినా.. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది.
చిత్రం విడుదలైన తర్వాతి ఐదురోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటి ఆశ్చర్యపరిచింది. యాక్షన్, విజువల్స్, స్టోరీ కెనెక్ట్ కావడంతో ఆడియెన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇప్పటికీ సినిమాను థియేటర్లలో కొనసాగుతోంది. 27 రోజులుగా థియేట్రికల్ రన్ కొనసాగించిన ఈ చిత్రం తాజాగా రికార్డు లెవల్లో కలెక్షన్లను నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి ఇండియన్ సినిమా సత్తాను చాటింది. ఈవిషయాన్ని స్వయంగా చిత్ర యూనిటే ప్రకటించింది. ఇక ఫేజ్ 1 రిలీజ్ లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ హిందీ ఫిల్మ్ గా ‘పఠాన్’రికార్డు క్రియేట్ చేసిందని యూనిట్ వెల్లడించారు.
‘జీరో’ సినిమా విడుదలైన నాలుగేండ్ల తర్వాత ‘పఠాన్’తో వచ్చిన షారుఖ్ ఖాన్ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతున్నారు. ఇక హిందీలో ఇప్పటికే కేజీఎఫ్ చిత్రం రికార్డను బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు బాహుబలి చిత్ర రికార్డునూ దాటేందుకు ప్రయత్నిస్తోంది.
రూ.1000 కోట్ల గ్రాస్ వసూల్ చేయగా.. అందులో ఇండియాలో రూ.623 కోట్ల గ్రాస్ (రూ.516.92 కోట్ల నెట్) మరియు ఓవర్సీస్ లో రూ.377 కోట్ల గ్రాస్ (45.97 మిలియన్ల డాలర్స్) వసూల్ చేసినట్టు తెలిపారు. ఇంకా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చిత్ర యూనిట్ తెలుపుతోంది. కొద్దికాలంలో బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎరుదెబ్బ తింటున్న తరుణంలో ‘పఠాన్’ ఊపిరి పోసింది. అదిరిపోయే కలెక్షన్లతో బాలీవుడ్ సినిమా సత్తాను చాటింది.
ఈ చిత్రం క్రియేట్ చేసిన రికార్డుతో షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ దరకత్వంలో వస్తున్న ‘జవాన్’పై హైప్ బాగా ఉంది. అలాగే డుంకీ చిత్రంపైనా ఆసక్తి నెలకొంది. మరోవైపు భారీ మల్టీ స్టారర్స్ ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక ‘వార్’ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘పఠాన్’ను తెరకెక్కించాడు. జాన్ అబ్రహం, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) షారుఖ్ సరసన నటించింది. ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు.