నటి శోభితా ధూళిపాళ్ల తన గ్లామరస్ లుక్స్, లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నాగ చైతన్యతో వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు అందం శోభితా ధూళిపాళ్ల ప్రస్తుతం బాలీవుడ్‌లో సెటిల్ అయింది. తెలుగు సినిమాల్లోనూ నటించిన ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామరస్ లుక్స్‌తో రచ్చ చేస్తోంది. ఆమె కొత్త ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
25
బాలీవుడ్ ఎంట్రీ ఇలా..
శోభితా ధూళిపాళ్ల ముందుగా హిందీ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2016లో అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన 'రమణ్ రాఘవ్ 2.0' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'చెఫ్', 'కాలాకాండీ' లాంటి హిందీ చిత్రాల్లో నటించింది. ఆపై అడివి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
35
తెలుగు, తమిళంలోనూ క్రేజ్
శోభితా ధూళిపాళ్ల తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తమిళంలో ఆమె నటించిన 'పొన్నియిన్ సెల్వన్' రిలీజ్ అయ్యాక, ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమాలో ఆమె లుక్, యాక్టింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ భాషల నుంచి శోభితకు వరుస అవకాశాలు వస్తున్నాయి. దీనికి తోడు బాలీవుడ్‌లోనూ ఆఫర్లకు కొదవ లేదు.
శోభితా ధూళిపాళ్ల పర్సనల్ లైఫ్ కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. హీరో నాగ చైతన్యను పెళ్లాడిన శోభిత, ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్లకు హాజరవుతున్నారు. అక్కడి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జంట కెమిస్ట్రీ అభిమానులను భలేగా ఆకట్టుకుంటోంది.
55
తరచుగా రూమర్స్
ఇప్పుడు చైతన్య, శోభిత గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఈ జంట నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం శోభితా ధూళిపాళ్ల తన సినిమాలు, ఈవెంట్లు, సోషల్ మీడియా పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తోంది.