రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా మైసా. నవంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రష్మిక సోలో హీరోయిన్ గా నటిస్తోంది. అన్ ఫార్ములా ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవీంద్ర పుల్లే ఈ చిత్రానికి దర్శకుడు.
25
అంచనాలు పెంచేసిన టీజర్
తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో ఊహకందని స్టఫ్ ఉంది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, రష్మిక కళ్ళు చెదిరే యాక్షన్స్ స్టంట్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా టీజర్ లో విజువల్స్ కట్టి పడేస్తున్నాయి. అదే విధంగా రష్మిక పవర్ ఫుల్ యాక్షన్ తో పాన్ ఇండియా స్టార్లకు పోటీ ఇచ్చే విధంగా హంగామా చేసింది.
35
అదిరిపోయే విజువల్స్
అలసిపోయాను, ఆగిపోయాను, ఓడిపోయాను అంటూ రష్మిక చెప్పే డైలాగులతో టీజర్ మొదలవుతుంది. చూస్తుంటే ఈ చిత్రం తిరగబడ్డ మహిళ చేసిన పోరాటంగా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. టీజర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ ఇచ్చిన బిజియం కూడా బావుంది.
ఈ మూవీలో రష్మిక గిరిజన మహిళగా నటిస్తున్నారు. టీజర్ లో ఫారెస్ట్ లో జరిగే ఫైట్స్, అండర్ వాటర్ యాక్షన్ లాంటి విజువల్స్ చూపించారు. రష్మిక ఉగ్ర రూపం దాల్చిన వీర నారిగా రెచ్చిపోయింది.
55
రష్మిక పాన్ ఇండియా హిట్లు
టీజర్ లోనే ఈ రేంజ్ స్టఫ్ ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అంటూ నెటిజన్లలో అంచనాలు పెరిగిపోతున్నాయి. రష్మిక హీరోయిన్ గా పుష్ప, యానిమల్ లాంటి పాన్ ఇండియా సూపర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు సోలో హీరోయిన్ గా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ఈ మూవీలో రావు రమేష్, ఈశ్వరి రావు, రాహుల్ రవీంద్రన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.