శోభితా దూళిపాళ(Sobhita Dhulipala).. తాజాగా అవార్డు ఫంక్షన్‌లో పాల్గొంది. ఓటీటీ వెబ్ సిరీస్‌లకు కూడా ప్రముఖ ఓటీటీ మాధ్యమాలు అవార్డులు ఇస్తున్నాయి. అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి సంస్థలు అందించిన అవార్డు వేడుకలో శోభితా పాల్గొంది. అవార్డు కైవసం చేసుకుంది.
29
photo credit sobhita dhulipala instagram
ఇందులో ఆమె వెబ్ సిరీస్ `ది నైట్ మేనేజర్` వెబ్ సిరీస్‌లో `కావేరి` పాత్రకిగానూ, అలాగే `మేడ్ ఇన్ హెవెన్`లో తారా ఖన్నా పాత్రకిగానూ అవార్డు అందుకుంది. బెస్ట్ యాంకర్ అవార్డుని ఆమె సొంతం చేసుకోవడం విశేషం. ఈ సందర్బంగా అవార్డు ఈవెంట్‌లో నయా అందాలతో మెరిసింది శోభిత.
39
photo credit sobhita dhulipala instagram
ఇందులో గోల్డ్ శారీలో మెరిసింది శోభిత. అత్యంత పలుచని, ఉల్లిపొరలాంటి శారీ కట్టింది. దీనికితోడు కొప్పున మల్లెపూలు పెట్టుకుని నయా అందాల విందుని వడ్డించింది. బ్యాక్ అందాన్ని ఫోకస్ చేస్తూ కెమెరాకి పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ లుక్ ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.
49
photo credit sobhita dhulipala instagram
అవార్డు వచ్చిన సందర్బంగా శోభిత థ్యాంక్స్ నోట్‌ని పంచుకుంది. తార, కావేరి లాంటి సంఘర్షణతో కూడిన పాత్రలకుగానూ ఉత్తమ నటి అవార్డుని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.
59
photo credit sobhita dhulipala instagram
అలాగే, సంక్లిష్టమైన మహిళలు, తల్లి లాంటి బలమైన అమ్మాయిల పాత్రల కేంద్రంగా కథనాలు అందించిన హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వారికి ఆమె థ్యాంక్స్ చెప్పింది.
69
photo credit sobhita dhulipala instagram
పరిపూర్ణమైన మహిళను ఆవిష్కరించేలా ప్రోత్సహించిన `మేడ్ ఇన్ హెవెన్, ``ది నైట్ మేనేజర్` వెబ్ సిరీస్ నిర్మాతలు, దర్శకులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఇది తనకు అద్భుతమైన ఏడాదిగా ఆమె వెల్లడించింది.
79
photo credit sobhita dhulipala instagram
శోభిత ఓ వైపు వెబ్ సిరీస్‌లు, మరోవైపు సినిమాలతో కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అయితే ఈ బ్యూటీ తెలుగు అమ్మాయి అయినా, ఫోకస్ మాత్రం హిందీ మీదే ఉంది. తెలుగులో ఆశించిన స్థాయిలో ఎంకరేజ్‌మెంట్ ఉండదని, అవకాశాలు రావని భావించిన ఆమె బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది.
89
photo credit sobhita dhulipala instagram
తెలుగులో `గూఢచారి`, `మేజర్`లో నటించిన శోభిత హిందీలో మాత్రం `రామన్ రాఘవ్ 2.0`, `చెఫ్`, `కాలకాండి`, `ది బాడీ`, `ఘోస్ట్ స్టోరీస్` చిత్రాలు చేసింది. ఇటీవల తమిళంలో `పొన్నియిన్ సెల్వన్` చిత్రాల్లో మెరిసింది. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కావడంతో ఇండియా వైడ్‌గా ఆకట్టుకుంది శోభిత.
99
photo credit sobhita dhulipala instagram
ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో `సితార` అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే ఓ హాలీవుడ్ ఫిల్మ్ చేస్తుంది. `మంకీ మ్యాన్` అనే ఆమెరికా మూవీ చేస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది.