Sobhita Dhulipala: 16 ఏళ్ల వయసులో ఎవరు సపోర్ట్ చేయలేదు, ఇండస్ట్రీపై శోభిత ధూళిపాళ సంచలన కామెంట్స్..

Published : Sep 18, 2026, 03:44 PM IST

Sobhita Dhulipala: ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదగడంపై సంచలన కామెంట్స్ చేసింది స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు శోభిత ధూళిపాళ. ఒకరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేనివారు చాలామంది ఉంటారని ఆమె అన్నారు. ఇంతకీ ఈ మాటలు ఆమె ఎందుకు అన్నారంటే?

PREV
14
శోభిత ధూళిపాళ సంచలన వ్యాఖ్యలు

సమాజంలో ఒకరి ఎదుగుదలను మరొకరు ప్రోత్సహించరని, మన ఎదుగుదలకు మనమే శత్రువులమవుతామని స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఒక తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ "ఒకరి ఎదుగుదలను మనవాళ్లే ప్రోత్సహించరు" అని పెట్టిన పోస్ట్‌పై ఆమె స్పందిస్తూ "100 శాతం వాస్తవం" అని గట్టిగా సపోర్ట్ తెలిపారు. సమాజంలో ఇతరుల పురోగతిని చూసి ప్రోత్సహించే గుణం చాలా తక్కువగా ఉంటుందని, ఈ చేదు నిజాన్ని ప్రతీ ఒక్కరూ అంగీకరించక తప్పదని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

24
16 ఏళ్ల వయసులో ముంబై ప్రయాణం

ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను శోభిత గుర్తుచేసుకున్నారు. కేవలం 16 ఏళ్ల చిన్న వయసులోనే ఎటువంటి భరోసా,సపోర్ట్ లేకుండా ముంబైకి వెళ్లానని, ఎన్నో రిస్కులు తీసుకుని ముందడుగు వేశానని శోభిత అన్నారు. ఆ సమయంలో తనకు ఎవరూ ప్రోత్సాహం అందించలేదని, పెద్ద కలలు కనే వారిని లేదా కొత్త దారుల్లో ప్రయాణించే వారిని ఈ సమాజం అంత సులభంగా ఆదరించదని తాను వ్యక్తిగతంగా గమనించినట్లు పేర్కొన్నారు. ఏదైనా ఒక రంగంలోకి కొత్తగా అడుగుపెట్టే వారికి, అప్పటికే అక్కడ స్థిరపడిన వారు మద్దతు ఇవ్వడం చాలా అరుదని శోభిత అభిప్రాయపడ్డారు.

34
మహిళలకు ఇబ్బందులు ఎక్కువ..

ముఖ్యంగా మహిళలు కొత్తగా ఏమైనా ప్రయత్నిస్తే వారికి ఎదురయ్యే ఇబ్బందులు, సవాళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని శోభిత అన్నారు. ఆడవాళ్లు స్వతంత్రంగా ఎదగాలని చూసినప్పుడు సమాజం నుంచి ప్రోత్సాహకం కంటే అడ్డంకులే ఎక్కువగా ఎదురవుతాయని ఆమె కామెంట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు తాను కెరీర్ ప్రారంభించిన నాటి పరిస్థితులకు సంబంధించినవని, ప్రస్తుతం పరిస్థితులు కొంతైనా మారి ఉంటాయని ఆశిస్తున్నట్లు శోభిత తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఎదిగేందుకు అవసరమైన మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

44
సోషల్ మీడియాలో దుమారం..

ఒకరికొకరు అండగా నిలవాల్సిన అవసరం ఉందని, స్వశక్తితో ముందడుగు వేసినప్పుడే విజయం సాధ్యమవుతుందని శోభిత అన్నారు. 'గూఢచారి', 'మేజర్', 'పొన్నియిన్ సెల్వన్' వంటి విజయవంతమైన చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె చెప్పిన మాటలు అక్షరసత్యమని, సమాజంలో యథార్థ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించారని నెటిజన్లు, అభిమానులు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. నాగచైతన్యను పెళ్లాడి.. అక్కినేని కోడలు గా వెళ్లిన ఆమె.. సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే తెరపై మెరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories