అక్కినేని నాగ, చైతన్య శోభిత ధూళిపాల గత ఏడాది డిసెంబర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్ళికి ముందు ఈ జంట గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. సమంతతో విడిపోయాక చైతూకి ఇది రెండో వివాహం. దీనితో మీడియాలో ఎక్కువగా హైలైట్ అయ్యారు. ప్రస్తుతం చైతు, శోభిత దంపతులుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. పెళ్లి తర్వాత నాగ చైతన్య నుంచి రిలీజ్ అవుతున్న తొలి చిత్రం తండేల్.
24
ఒక వైపు తండేల్ రిలీజ్ అవుతుంటే మరో వైపు శోభిత ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తండేల్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు చెబుతూ శోభిత పోస్ట్ చేసింది. తండేల్ చిత్రం రిలీజ్ అవుతుండడంతో చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నా.
34
తండేల్ చిత్ర షూటింగ్ జరిగినన్ని రోజులు నువ్వు చాలా పాజిటివ్ గా, ఫోకస్డ్ గా కనిపించావు. అందరితో పాటు నేను కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసేందుకు ఎదురుచూడలేకున్నా అని శోభిత తన భర్త చిత్రం గురించి పోస్ట్ చేసింది.
44
Sobhita Dhulipala
అయితే ఆమె సంతోషం మరొకటి ఉంది. ఫ్యాన్స్ కి ఆ గుడ్ న్యూస్ ని షేర్ చేసింది. ఫైనల్ గా నువ్వు గడ్డం షేవ్ చేస్తావు.. మొదటి సారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ అంటూ శోభిత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. శోభిత పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.