ఫస్టాఫ్ లో కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్, పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వెల్ సన్నివేశం హైలైట్ అని చెప్పొచ్చు. అయితే మొదటి గంట మాత్రం సినిమా చాలా స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి కథ పికప్ అవుతుంది. కథలో డ్రామా పండలేదు. ఇటీవల కాలంలో దేవిశ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన చిత్రం ఇదే అని చెప్పొచ్చు. నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీకి మించి దేవిశ్రీ సంగీతం హైలైట్ అయింది.