'అపరిచితుడు' కథని శోభన్ బాబు సూపర్ హిట్ మూవీ నుంచి కాపీ చేశారా, డైరెక్టర్ శంకర్ ఏమన్నారో తెలుసా ?

ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ ఒక్కో చిత్రాన్ని ఒక్కో ఆణిముత్యంలా మలిచారు. జెంటిల్ మాన్ నుంచి రోబో వరకు శంకర్ కి పరాజయమే లేదు. అపరిచితుడు చిత్రం అయితే యావత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. 

Sobhan Babu, Vikram

ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ ఒక్కో చిత్రాన్ని ఒక్కో ఆణిముత్యంలా మలిచారు. జెంటిల్ మాన్ నుంచి రోబో వరకు శంకర్ కి పరాజయమే లేదు. అపరిచితుడు చిత్రం అయితే యావత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. హీరోని మల్టిపుల్ డిజార్డర్స్ ఉన్న పాత్రల్లో చూపించడం అప్పట్లో సంచలనం. హీరో విక్రమ్ అయితే నట విశ్వరూపం ప్రదర్శించారు. 

Aparichithudu Movie

శంకర్ దర్శకత్వ ప్రతిభకి దేశం మొత్తం సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. అప్పటికి ఇండియాలో ఇలాంటి చిత్రం రావడం అంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అని అంతా భావించారు. అయితే ఈ చిత్రానికి, లెజెండ్రీ నటుడు శోభన్ బాబు నటించిన ఒక సూపర్ హిట్ చిత్రానికి లింక్ ఉంది. అపరిచితుడు చిత్రంలో హీరో తన మానసిక సంఘర్షణ వల్ల మల్టిపుల్ డిజార్డర్ అనే మానసిక రోగిగా మారతారు. 


Aparichithudu Movie

సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలు చూసినప్పుడు రాము.. అపరిచితుడుగా మారిపోతాడు. తప్పు చేసిన వారిని శిక్షిస్తుంటాడు. 1972లో సోగ్గాడు శోభన్ బాబు మానవుడు దానవుడు అనే చిత్రంలో నటించారు. కృష్ణ కుమారి, శారద, కైకాల సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో శోభన్ బాబు పగలంతా ఒక డాక్టర్ గా సాధారణంగా వైద్యం అందిస్తుంటారు. రాత్రి అయితే రాక్షసుడిగా మారి హత్యలు చేస్తుంటాడు. తన పర్సనల్ లైఫ్ జరిగిన అన్యాయాలే అందుకు కారణం. 

ఈ చిత్రాన్ని హాలీవుడ్ మూవీ డాక్టర్ జేకిల్ అండ్ మిస్టర్ హైడ్ నుంచి స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కించారు. ఈ మూవీలో హీరో ఒక డాక్టర్ గా పనిచేస్తూ రాత్రి క్రూరమైన వ్యక్తిగా కనిపిస్తాడు. ఇద్దరూ వేర్వేరు అనుకుంటుంటారు. కానీ ఇద్దరూ ఒక్కరే. తనలోనే మానసిక సమస్య వల్లే హీరో అలా బిహేవ్ చేస్తుంటాడు. 

1998లో ఆంగ్లంలో టెల్ మీ యువర్ డ్రీమ్స్ అనే నవల పబ్లిష్ అయింది. ఈ నవలలో ఒక అమ్మాయి చిన్న తనంలోనే లైంగిక వేధింపులకు గురై తనలోనే మానసిక వేదన వల్ల మల్టిపుల్ డిజార్డర్ ఉన్న ముగ్గురు అమ్మాయిలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. డాక్టర్ జేకిల్ అండ్ మిస్టర్ హైడ్, టెల్ మీ యువర్ డ్రీమ్స్, మానవుడు దానవుడు ఆధారంగా శంకర్ అపరిచితుడు చిత్రాన్ని తెరకెక్కించినట్లు వార్తలు వచ్చాయి. 

Director Shankar

దీని గురించి శంకర్ ని ప్రశ్నించినప్పుడు అపరిచితుడు చిత్రం రిలీజ్ అయ్యాక మాత్రమే ఆ చిత్రాల గురించి తనకి తెలిసింది అని సమాధానం ఇచ్చారు. అపరిచితుడు గురించి వచ్చిన మరో రూమర్ ఏంటంటే.. ఈ చిత్రంలో హీరో గరుడ పురాణం ఆధారంగా చెడ్డవాళ్ళని శిక్షిస్తుంటాడు. ఇదే కాన్సెప్ట్ తో 1995లో సెవెన్ అనే చిత్రం రూపొందింది. బైబిల్ చెప్పిన వాక్యాలు ఆధారంగా హీరో కొందరిని చంపుతుంటాడు. అపరిచితుడు చిత్రానికి  ఎలాంటి స్ఫూర్తి లేదని శంకర్ చెబుతున్నపటికీ ఈ చిత్రాల కాన్సెప్ట్ తోనే రూపొందించారు అనే ఆరోపణలు ఉన్నాయి. 

Latest Videos

click me!