నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి సంబంధించిన అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయంలో బాలయ్య పెద్ద రిస్క్ చేస్తున్నారు.
నందమూరి తారక రామారావు నటన వారసుడిగా నందమూరి బాలకృష్ణ రాణిస్తున్నారు. టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఉన్నారు. అయితే ఆయన వారసుడి ఎంట్రీ కోసం చాలా కాలంగా చర్చ జరుగుతుంది. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ త్వరలో ఉంటుందని గత మూడునాలుగేళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో `సింబా` పేరుతో మూవీని రూపొందించబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఇది ఆగిపోయింది. కొత్తగా మరే అప్ డేట్ రాలేదు.
25
ఆదిత్య 999 మ్యాక్స్ తో మోక్షజ్ఞ ఎంట్రీ
ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు మరో అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందట. క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ `ఆదిత్య 999 మ్యాక్స్` పేరుతో దీన్ని రూపొందించనున్నారు. `ఆదిత్య 369`కి సీక్వెల్‌గా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర కథని బాలయ్యనే తయారు చేశారు. దీన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించారు. తానే దర్శకత్వం వహించాలనుకున్నారు, కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నారట. క్రిష్‌కి ఆ పగ్గాల అప్పగించారట.
35
క్రిష్ విషయంలో బాలయ్య రిస్క్ చేస్తున్నారా?
బాలయ్య వారసుడి కోసం ఆయన అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఉగాది పండగ సందర్భంగా ఈ మూవీని ప్రారంభించే అవకాశం ఉందనే వార్తలు వినిస్తున్నాయి. ఇది నందమూరి అభిమానుల్లో కొంత జోష్ నింపింది. అయితే ఇక్కడే మరో డౌట్ కొడుతుంది. బాలయ్య రిస్క్ చేస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. క్రిష్ ఇటీవల కాలంలో దర్శకుడిగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఆయన తీసిన `కథానాయకుడు` ఆడలేదు. `కొండపొలం` తేడా కొట్టింది. `హరి హర వీరమల్లు` నుంచి మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతోపాటు ఇటీవల అనుష్క ప్రధాన పాత్రలో `ఘాటి` అనే మూవీని రూపొందించారు. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ క్రమంలో ఒక కొత్త హీరోని, పైగా భారీ అంచనాలు ఉన్న హీరోని ఆయన చేతిలో పెట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది. అభిమానులను ఇది కలవరానికి గురి చేస్తోంది.
ఇదిలా ఉంటే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి సంబంధించి గత కొన్నేళ్లుగా డిలే కావడానికి మరో కారణం కూడా ఉందట. ఆయనకు సరైన మూవీ సెట్ కాకపోవడమే కాదు, మోక్షజ్ఞకి ఆసక్తి లేదని సమాచారం. ఆయనకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని, బాలయ్య బలవంతంగా ఇందులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తుంది. హీరో అంటే లుక్ పరంగా, బాడీ లాంగ్వేజ్ పరంగా, నటన, డాన్సుల పరంగా పర్‌ఫెక్ట్ గా రెడీ కావాల్సి ఉంటుంది. అది అంత ఈజీ కాదు. ఈ విషయంలో మోక్షజ్ఞ వెనకడుగు వేస్తూ వస్తున్నారని, వీటిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ డిలే అవుతుందని టాక్.
55
బాలయ్యని భయపెడుతున్నది ఇదే
ఏదేనా వారసత్వం, తండ్రి ఇమేజ్ మొదటి సినిమాకే పని చేస్తుంది. నటుడిగా తనకు తాను మాత్రమే నిరూపించుకోవాలి. లేదంటే ఫేడౌట్ అయిపోతారు. ఇదే ఇప్పుడు బాలయ్యని తన వారసుడి విషయంలో భయపెడుతుందని టాక్. మరి ఏం చేస్తారనేది చూడాలి. ఇక బాలకృష్ణ చివరగా `అఖండ 2`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇది బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమా చేయబోతున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది.