శోభన్ బాబు చెప్పినా వినలేదు, సావిత్రి నుంచి నేర్చుకోలేదు..తన జీవితంలో దిద్దుకోలేని తప్పు చేసిన జయసుధ

Published : Jul 17, 2025, 09:48 AM IST

ఒక సమయంలో శోభన్ బాబు.. జయసుధకు పందులు తిరిగే, దుర్వాసనతో కూడిన ఒక స్థలాన్ని కొనమని సలహా ఇచ్చారు. శోభన్ బాబు మాటలని పెడచెవిన పెట్టిన జయసుధ కొన్ని కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకునే అవకాశం కోల్పోయారు. 

PREV
15
అగ్ర హీరోలతో నటించిన జయసుధ 

సహజ నటి అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే జయసుధ చిన్నతనం నుంచే నటించడం ప్రారంభించారు. టీనేజ్ వయసులోనే హీరోయిన్ అయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి అగ్ర హీరోలతో జయసుధ అనేక చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో జయసుధ.. సావిత్రి, వాణిశ్రీ, శ్రీదేవి, జయప్రద తర్వాత అంతటి గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

25
ఆమె సహకారంతో ఇండస్ట్రీలోకి.. 

జయసుధ లెజెండ్రీ నటి, దర్శకురాలు విజయనిర్మలకు బంధువు. ఆమె సహకారంతోనే జయసుధ ఇండస్ట్రీలోకి వచ్చారు. నటిగా జయసుధ ఎంత పాపులర్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఆమె ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒక దశలో ఆమె ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డారు. అదే విధంగా జయసుధ భర్త నితిన్ కపూర్ మరణం చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. 

35
శోభన్ బాబు ల్యాండ్ కొనమని చెప్పారు 

ఆమె భర్త మరణానికి కారణం ఆర్థిక సమస్యలే అని ఒక ప్రచారం ఉంది. ఓ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ నటిగా తాను స్టార్ గా ఎదిగినప్పటికీ డబ్బు సంపాదనలో వెనుకబడడానికి కారణం చెప్పారు. గతంలో చెన్నైలో ఉన్నప్పుడు శోభన్ బాబు గారు నాకు ఒక ల్యాండ్ చూపించి దానిని కొనుక్కోమని రిక్వెస్ట్ చేశారు. షూటింగ్ నుంచి ఆయన కారులో ఇంటికి వెళుతుంటే.. నేను చెప్పిన ప్లేస్ ఇదే.. వెంటనే మీ నాన్నకి చెప్పి ఈ స్థలాన్ని కొను అని అన్నారు. 

45
డంపింగ్ యార్డ్ చూపించిన శోభన్ బాబు 

ఆయన చూపించింది డంపింగ్ యార్డ్. పందులు తిరుగుతూ భరించలేని దుర్వాసనతో ఆ స్థలం ఉంది. నేను ఈయనకి ఏమైనా పిచ్చా. డంపింగ్ యార్డ్ ని కొనమంటున్నారు ఏంటి అని అనుకున్నా. ఆ ప్లేస్ అస్సలు వద్దనే వద్దు అని అనుకున్నా. శోభన్ బాబు ఎంత రిక్వెస్ట్ చేసినా వినలేదు. ఆరోజు ఆయన మాటని పెడచెవిన పెట్టాను. ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ అన్నా నగర్ గా చాలా డెవలప్ అయింది. అక్కడ ఎకరం 100 కోట్ల ధర పలుకుతోంది అని జయసుధ గుర్తు చేసుకున్నారు. 

55
సావిత్రి గురించి తెలిసింది అదొక్కటే 

సావిత్రి గారి జీవితం నుంచి కూడా నేను గుణపాఠం నేర్చుకోలేదు. అప్పట్లో సావిత్రి గారికి మద్యం సేవించే బ్యాడ్ హ్యాబిట్ మాత్రమే ఉందని తెలుసు. ఆమె గురించి ఇతర విషయాలు మాకు తెలియవు. ఆమె ఆస్తులు, డబ్బు ఎలా కోల్పోయారు అనేది అంతగా తెలియదు. నేను నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు సినిమాలు నిర్మించడం. తాను, తన భర్త నిర్మించిన చిత్రాలు తమని ఆర్థికంగా బాగా దెబ్బతీశాయని జయసుధ తెలిపారు. శోభన్ బాబు గారు మాత్రం డబ్బు విషయంలో ప్లానింగ్ తో ఉండేవారు. ఒక డంపింగ్ యార్డ్ భవిష్యత్తులో విలువైన ల్యాండ్ గా మారుతుంది అని ఆయన అప్పట్లోనే అంచనా వేయగలిగారు అని జయసుధ తెలిపింది. 

Read more Photos on
click me!

Recommended Stories