ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ. వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్. ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు.