కసి చూపులతో ఊరిస్తున్న హోమ్లీ బ్యూటీ.. నిచ్చెన ఎక్కుతూ కళ్ళు చెదిరే గ్లామర్ షో

First Published Oct 1, 2022, 5:15 PM IST

అందాల తార స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది.

అందాల తార స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. 

ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.  వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్. ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు. 

స్నేహ, ప్రసన్న దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో స్నేహ రాంచరణ్ కు వదిన పాత్రలో నటించి మెప్పించింది. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేయలేదు. 

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ స్నేహ అదే ఫిట్ నెస్ తో మెప్పిస్తోంది. స్నేహ తాను అందాల దేవత అని మరోసారి నిరూపించుకుంది. 

సాధారణంగా స్నేహ సాంప్రదాయ వస్త్రధారణలో, చీరకట్టులో అందంగా ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో సైతం తనకు తిరుగులేదని స్నేహ సోషల్ మీడియా వేదికగా నిరూపిస్తోంది. 

తాజాగా స్నేహ తనలోని కొత్త గ్లామర్ యాంగిల్ ని బయట పెట్టింది. స్నేహ వయసు రోజు రోజుకి తగ్గిపోతోందా అనేంతలా గ్లామర్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. కళ్ళతోనే మన్మధ బాణాలు సంధిస్తూ కసి చూపులతో కవ్విస్తోంది. 

ట్రెండీ గా ఉన్నరెడ్ డ్రెస్ లో స్నేహ ఇచ్చిన ఫోజులు అద్భుతం అనే చెప్పాలి. ఈ డ్రెస్ చాలా ట్రెండీగా ఉంటూ స్నేహకి బాగా సెట్ అయిందనే చెప్పాలి. స్నేహ అందానికి నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. నిచ్చెన ఎక్కుతూ స్నేహ తన అందంతో ఆకర్షిస్తోంది. 

click me!