నాని “సరిపోదా శనివారం” కథ ఇదే, చాలా ఇంట్రస్టింగ్ పాయింట్

First Published | Aug 8, 2024, 11:21 AM IST

ఇప్పటికే ఓవర్సీస్‌లో పలు ప్రాంతాల్లో సినిమా బుకింగ్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. 

Saripodhaa Sanivaaram

 
దసరా, హాయ్ నాన్న బ్యాక్ టు బ్యాక్ హిట్లతో  సూపర్ ఫామ్ లో ఉన్న నానీ తాజా చిత్రం సరిపోదా శనివారం.  డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ దర్శకుడుతో గతంలో అంటే సుందరానికి అనే చిత్రం చేసారు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ కాకపోయినా ఫ్యామిలీలకు బాగానే నచ్చింది. ఇప్పుడు రూట్ మార్చి మాస్ ఆడియన్స్ కోసం సరిపోదా శనివారం చిత్రం తెస్తున్నారు. పోస్టర్స్, టీజర్స్ లో ఇంట్రస్టింగ్ గా కనిపిస్తున్న ఈ చిత్రం కథేంటనేది అందరిలో క్యూరియాసిటీగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ లైన్ నటుడు ఎస్ జె సూర్య రివీల్ చేసారు. 

Saripodhaa Sanivaaram


 దర్శకుడు ఎస్ జె సూర్య తాను విలన్ గా నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా కథను   చెప్పేసారు. ఆయన మాట్లాడుతూ..‘సినిమా కథను ముందుగా చెప్పయచ్చు. ఎందుకంటే కథలు పెద్దగా కొత్తగా వుండవు. ఎలా చెప్పామా? అన్నదే కొత్తగా వుండాలి’ అని సూర్య ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో అన్నారు. భాషా సినిమా నుంచి ఇంద్ర, సమరసింహారెడ్డి వరకు లైన్ ఒక్కటే. జానర్ ఒక్కటే, దాని చుట్టూ ఎలాంటి కథ అల్లుకున్నామా? అన్నదే సక్సెస్ పాయింట్ అని సూర్య చెప్పుకొచ్చారు.ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా కథ కూడా అలాంటిదే అని సూర్య వెల్లడించారు. 
 



ఆ కథ గురించి చెప్తూ...వారంలో అయిదు రోజులు మామూలు మాణిక్యంలా వుంటే కుర్రాడు శనివారం మాత్రం భాషా మాదిరిగా వుంటాడు. ఎందుకంటే చిన్నపుడు తల్లికి మాట ఇచ్చాడు. విపరీతమైన కోపం వున్న కుర్రాడి దగ్గర నుంచి తల్లి మాట తీసుకుంటుంది. కోపాన్ని అన్ని రోజులు కాకుండా వారంలో ఒక్క రోజు మాత్రం చూపించమని. అందుకే హీరో కోపాన్ని చూపించడానికి శనివారం ఎంచుకుంటాడు. ఇదీ కథ అని చెప్పేసారు.
 

sj suryah


వారం రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వుండడం, ఒక్క రోజు దాన్ని వెళ్లగక్కడం అన్నది చూసే ప్రేక్షకులకు హై ఇస్తుందనే విషయం చుట్టూ అల్లిన కథనం ఇది. ఈ చిత్రం 2 గంటల 35 నిమిషాల రన్ టైంతో రాబోతుందని తెలుస్తుంది. అయితే ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు సో ఇక్కడ కొంచెం మార్పు ఉండొచ్చుని లేదా అదే రన్ టైంతో రావచ్చునని తెలుస్తుంది. ఇక ఇందులో ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం. నాని మరోసారి డ్యూయల్ షేడ్స్ లో నటించబోతున్నాడని తెలుస్తుంది.
 

Actor Nani


ఎస్ జెసూర్య, అభిరామి, ఆదితి బాలన్, పి సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్, సుప్రీత్, అజయ్ ఘోష్, శుభలేక సుధాకర్ నటించారు. ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులో సరిపోదా శనివారంగా రాబోతుండగా.. మిగిలిన భాషల్లో డబ్ కాబోతుంది. అలాగే సూర్యస్ సాటర్ డే పేరుతో రాబోతోన్నట్లు తెలుస్తుంది. హిందీ, మలయాళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ కానుంది. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. 

Latest Videos

click me!