అల్లు అరవింద్ కు థియేటర్స్ లేవా?, నమ్మలేని నిజం

First Published | Aug 8, 2024, 10:50 AM IST

ఈ సినిమాల ఎఫెక్ట్ త‌న సినిమాపై ప‌డింద‌ని త‌న ఆయ్ సినిమాకు థియేట‌ర్‌లు లేవ‌ని డిస్ట్రిబ్యూటర్‌లు చెబుతున్న‌ట్లు బ‌న్నీ వాసు తెలిపాడు. 

Allu Aravind

ఆ నలుగురు చేతిలోనే థియేటర్స్ ఉన్నాయి అనేది మనం ఎంతో కాలం నుంచి వింటూన్న మాట. ఆ నలుగురులో అల్లు అరవింద్ కూడా ఒకరని, థియేటర్స్ ని చేతిలో పెట్టుకున్న వారిలో ఆయన పాత్ర ఉందని మీడియాలో ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు థియేటర్స్ లేనే లేవు అంటున్నారు బన్ని వాసు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహితుడు...అల్లు అరవింద్ క్యాంప్ చెందిన ఈ నిర్మాత గీతా ఆర్ట్స్ 2 పై వరస సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో  తమ తాజా చిత్రం రిలీజ్ కు థియేటర్స్  లేవని వాపోయారు. 


 నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ... త‌న సినిమాకు థియేట‌ర్‌లు లేవ‌ని అందరి కన్నా ముందుగానే తాము రిలీజ్ డేట్ ప్రకటించిన కూడా త‌న సినిమా మాత్రం ప్ర‌స్తుతం థియేట‌ర్‌ల కొర‌త‌ను ఎదుర్కొంటుంది అని వాసు తెలిపాడు.  గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఆయ్ (AAY). ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్, న‌య‌న్ సారిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. అంజి కంచిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వ‌హిస్తున్నాడు.



 గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రం ఆగ‌ష్టు 15 విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వ‌రుస ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోటుంది చిత్ర‌యూనిట్. అయితే తాజాగా నిర్మాత బ‌న్నీ వాసు మూవీ గురించి మాట్లాడుతూ.. త‌న సినిమాకు థియేట‌ర్‌లు దొరకడం లేదని తెలిపాడు. ఆగ‌ష్టు 15న రామ్ పోతినేని డ‌బుల్ ఇస్మార్ట్‌తో పాటు ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. దీనితో పాటు త‌మిళం నుంచి తంగ‌లాన్ వ‌స్తుంది. అయితే ఈ సినిమాల ఎఫెక్ట్ త‌న సినిమాపై ప‌డింద‌ని త‌న ఆయ్ సినిమాకు థియేట‌ర్‌లు లేవ‌ని డిస్ట్రిబ్యూటర్‌లు చెబుతున్న‌ట్లు బ‌న్నీ వాసు తెలిపాడు. 


అయితే ఈ ఇంట‌ర్వ్యూలో ఓ రిపోర్ట‌ర్ అడుగుతూ.. అదేంటి సార్.. అల్లు అర్వింద్ గారికి చాలా థియేట‌ర్‌లు ఉన్నాయి క‌దా అంటాడు. దీనికి వాసు స్పందిస్తూ.. అల్లు అరవింద్ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్‌లు ఒక్క‌టి కూడా లేవు. అత‌డికి ఏకైక థియేట‌ర్.. అల్లు అర్జున్ ఏసియన్ మాల్ అది మాత్ర‌మే అంతకుమించి ఒక్క‌టి కూడా త‌న సోంతంగా లేవు అంటూ బ‌న్నీ వాసు వెల్ల‌డించాడు. 
 


తిరుగులేని ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా "ఆయ్" చిత్రం ఆకట్టుకోనుందన్న ధీమాతో ఉంది ఆ చిత్ర యూనిట్. నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, అంకిత్ కొయ్య ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగ‌స్ట్ 15న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ దీనికి సమర్పకుడిగా ఉన్నారు. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూర్చారు.

Latest Videos

click me!