అసలు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కాదా! పవన్ మూవీ గురించి మీకు తెలియని 6 విషయాలు!

Published : Sep 03, 2023, 11:31 AM ISTUpdated : Sep 03, 2023, 11:37 AM IST

పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఓజీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. అంచనాలకు మించి ఉన్న ఈ టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. ఈ క్రమంలో ఓజీకి సంబంధించిన ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి.   

PREV
18
అసలు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కాదా! పవన్ మూవీ గురించి మీకు తెలియని 6 విషయాలు!
Pawan kalyan OG Glimpse

కమ్ బ్యాక్ అనంతరం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రకటించిన చిత్రాల్లో ఓజీ అభిమానులను అమితంగా ఆకర్షించింది. ప్రకటన రోజు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ క్యూరియాసిటీ పెంచేసింది. దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ ని కొత్తగా చూపించబోతున్నాడనే నమ్మకం కలిగేలా చేసింది. ముంబై, జపాన్ ప్రాంతాలను సింబాలిక్ గా పోస్టర్లో చెప్పారు. అలాగే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ #OG అంటూ పవన్ కళ్యాణ్ పాత్ర ఏమిటో రివీల్ చేశారు. ఇక నిన్న పవన్ జన్మదినం పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్(OG Glimpse) అంచనాలు ఆకాశానికి చేర్చింది. 
 

28
Pawan kalyan OG Glimpse

ఈ క్రమంలో ఓజీ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సేకరించడమైనది. ముందుగా పవన్ కళ్యాణ్ ఆయుధం గురించి చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రత్యేకంగా రూపొందించిన కత్తి ఉంది. దీన్ని కటాల అంటారు. ఈ సినిమాలో ఈ ఆయుధం చాలా స్పెషల్ అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఈ ఆయుధం వాడతారు. కటాలను తిప్పడంలో  పవన్ ట్రైనింగ్ తీసుకున్నారు. కటాలతో పవన్ ఊచకోత విజువల్స్ మైండ్ బ్లాక్ చేయడం ఖాయం. ఓజీలో పవన్ ఆయుధం కటాల అని చెప్పొచ్చు. 
 

38
Pawan kalyan OG Glimpse

సుజీత్ (Sujeeth)తెరకెక్కించిన సాహోలో విషయం ఉన్నా సౌత్ ఆడియన్స్ కి ఎక్కలేదు. ఆ మూవీలో సుజీత్ సృష్టించిన క్రైమ్ వరల్డ్ ని మెచ్చుకోకుండా ఉండలేం. వాజీ అనే ఓ కల్పిత గ్యాంగ్ స్టర్ సిటీని సుజీత్ తెరపైకి తెచ్చాడు. ఈ వాజీ ఆనవాళ్లు ఓజీలో కనిపించడం ఊహించని పరిణామం. ఓజీ టీజర్లో ఒక షాట్ లో వాజీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అని రాసి ఉన్న కంటైనర్స్ మనం చూడొచ్చు. అసలు సాహో-ఓజీ చిత్రాలకు లింకేంటి? సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఓజీ తెరకెక్కుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఈ రెండు కథల  పీరియడ్స్ వేరు. 
 

48
og pawan

ఈ మూవీలో అజయ్ ఘోష్ పాత్ర చాలా ప్రత్యేకమట. అజయ్ ఘోష్ రిటైర్డ్ డాన్ గా కనిపిస్తాడట. తన శకం ముగియడంతో ఒకప్పటి గొప్పలు చెప్పుకుంటూ ఫన్ పంచుతాడట. మొట్టై రాజేంద్ర, జీవాలతో అజయ్ ఘోష్ కాంబినేషన్ సీన్స్ కామెడీ ట్రాక్స్ గా సాగుతాయట. అజయ్ ఘోష్ పాత్రలో ఫన్ తో పాటు విలనీ కూడా ఉంటుందట. పవన్-అజయ్ కాంబో సీన్స్ అలరిస్తాయని అంటున్నారు.  

58
Pawan kalyan OG Glimpse


ఓజీ రివేంజ్ డ్రామా అని తెలుస్తుంది. ఒకప్పుడు శత్రువులను ఊచకోత కోసి భయానక పరిస్థితులు సృష్టించిన పవన్... కొన్నాళ్ళు ముంబై వీడతాడు. అయితే అతడు మరలా ముంబై రావాల్సి వస్తుంది. దీని వెనకున్న నేపథ్యం ఏమిటనేది సినిమాలో ప్రధాన సంఘర్షణ కావచ్చు. కొందరిపై పగ తీర్చుకునేందుకే పవన్ ముంబై వస్తాడని తెలుస్తుంది. ఓజీ పీరియాడిక్ డ్రామాగా సాగుతుంది. 1950 నాటి ముంబై గ్యాంగ్ స్టర్ రోల్ లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. 
 

68
Pawan kalyan OG Glimpse


ఓజీ అనగా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని చిత్ర యూనిట్ ప్రచారం చేసింది. దీని అసలు అర్థం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నేమ్ అంటున్నారు. ఓజీ అనగా ఓజాస్ గంభీర(Ojas Gambheera) అట. అది పవన్ కళ్యాణ్ పాత్ర పేరు అని సమాచారం. బహుశా పవన్ కళ్యాణ్ తెలుగువాడిగా కాకుండా నార్త్ ఇండియన్ గానే పరిచయం అవుతాడేమో. 

78

టీజర్లో మరో ఆసక్తికర అంశం... పవన్ కళ్యాణ్ మరాఠీలో మాట్లాడటం. పోలీస్ స్టేషన్ లో ఆవేశంగా ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ మరాఠీలో డైలాగ్స్ చెబుతారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో మరాఠీ కుటుంబంలో పుట్టిన వాడిగా పవన్ కళ్యాణ్ పాత్ర ఉండొచ్చు. ఓజాస్ గంభీర అనే పేరు పెట్టడానికి ఇది కారణం కావచ్చు... ఇవి  ఓజీ చిత్రానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు...

88


డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుందని అంచనా.. 
 

Read more Photos on
click me!

Recommended Stories