చేతిలో ఒక్క సినిమా లేదు.. అయినా పూజా హెగ్దే ఇంత కూల్ గా ఉంటోందేంటీ?

First Published | Sep 3, 2023, 11:14 AM IST

పూజా హెగ్దే కెరీర్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. వరుస చిత్రాలతో సందడి చేసిన బుట్టబొమ్మ సైలెంట్ అయ్యింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ చేతిలో ఒక్క సినిమా లేకపోవడం గమనార్హం. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీఇచ్చింది. తొలిసినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. దాంతో వరుస ఆఫర్లు అందాయి. 
 

‘ముకుంద’, ‘డీజే’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అలావైకుంఠ పురంలో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాల్లో నటించి మరింత క్రేజ్ పొందింది. తక్కువ కావాలంలోనే స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. 
 


అయితే ఈ ముద్దుగుమ్మకు రెండేళ్ల నుంచి కాలం కలిసి రావడం లేదు. వరుస ఫ్లాప్స్ ను అందుకుంటూ వస్తోంది. ఏ సినిమా చేసినా.. ఎంతటి స్టార్ సరసన నటించినా ఫలితం ఉండటం లేదు. దీంతో తెలుగులో క్రమంగా సినిమా ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేదు. 
 

ఇందుకు కారణం గతేడాది రిలీజ్ అయిన ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజాకు ఆఫర్లు అందడం కష్టంగా మారుతోంది. మరోవైపు మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి కూడా తప్పుకుంది. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. 
 

అయితే, నిర్మాతల నుంచి ఆఫర్లు రావడం లేదనేది ఓ వాదన అవుతుండగా.. మరోవైపు బుట్టబొమ్మ కాలికి సర్జరీ కావడంతోనే సినిమాలకు కావాలనే దూరంగా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా పూజా హెగ్దే చేతిలో ఒక్క సినిమా లేకపోవడం గమనార్హం. 
 

ఇదిలా ఉంటే.. కెరీర్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నా... పూజా హెగ్దేమాత్రం కూల్ గా కనిపిస్తోంది. ఆయా ఈవెంట్లు, ప్రారంభోత్సవాలకు హాజరవుతూ సందడి చేస్తోంది. మరోవైపు బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ మైమరిపిస్తోంది. లేటెస్ట్ గా బ్లూ ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. 

Latest Videos

click me!