టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. గతేడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా అదరగొట్టింది. ఆడియెన్స్ ను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది.
రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రం ఎన్నో అంతర్జాయతీ అవార్డులను సైతం కొల్లగొట్టిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన Oscar Awardను సాధించి పెట్టింది. ఈ ఏడాది మార్చిలో అకాడెమీ నుంచి Naatu Naatu పాటకు ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీంతో ఇండియా మొత్తం గర్వించింది.
మరోసారి భారతీయ సినీ ప్రేక్షకులు గర్వించే క్షణం ‘ఆర్ఆర్ఆర్’తో వరించింది. తాజాగా ఆస్కార్ కమిటీ నుంచి ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఆహ్వానం అందింది. ‘ఆర్ఆర్ఆర్’ గెలుచుకోవడమే కాకుండా ఏకంగా అకాడెమీ జ్యూరీ మెంబర్స్ గా ఆరుగురుకి స్థానం కలిపించారు.
తాజాగా అకాడెమీ లేటెస్ట్ గా జ్యూరీలో యాడ్ అయిన 398 మంది సభ్యుల లిస్టును విడుదల చేసింది. ఇందులో సౌత్ వారికి ఎక్కువ స్థానాలు లభించాయి. ఇందులో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లు కూడా ఉన్నారు. ఈ లిస్టులో ‘ఆర్ఆర్ఆర్’తో అదరగొట్టిన NTR, Ram Charan, సాబు సిరిల్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్ ఉన్నారు.
జ్యూరీ మెంబర్స్ కొత్త లిస్టులో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్లోబల్ స్టార్స్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు లిస్టులో లేకపోవడం గమనార్హం. ఎంతో కృషి చేసిన జక్కనకు ఈ గౌరవం దక్కి ఉంటే బాగుండని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
కొత్తగా చేరిన మెంబర్స్ తో కలిపి ప్రపంచ వ్యాప్తంగా అకాడెమీ జ్యూరీ లిస్టులో 10,817 మంది ఉన్నారు. 96వ అకాడెమీ అవార్డ్స్ లో మాత్రం 9,375 మంది మాత్రమే ఓటు వేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ప్రముఖ దర్శకుడు మణిరత్నం, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్, సిద్ధార్థ్ రాయ్ లు కూడా జ్యూరీ మెంబర్స్ గా చోటు దక్కించుకున్నారు.