ఫస్ట్ కిస్ ఎక్స్ పీరియన్స్.. నోటిని డెటాల్ తో కడిగాను... నీనా గుప్తా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ..

Published : Jun 29, 2023, 10:11 AM IST

తన ఫస్ట్ కిస్ ఎక్స్ పీరియన్స్ గురించి వెల్లడిచింది బాలీవుడ్ నటి నీనా గుప్తా. అంతే కాదు ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఒకటి వెల్లడించింది. 

PREV
17
ఫస్ట్ కిస్ ఎక్స్ పీరియన్స్.. నోటిని డెటాల్ తో కడిగాను... నీనా గుప్తా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ..

 విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన సిరీస్‌ ల‌స్ట్ స్టోరీస్ 2 . ఈఆరోజు (జూన్ 29)  నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది  వెబ్ మూవీ. ఈ వెబ్ సిరీస్ కు సబంధించి ప్రమోషన్స్ ను గ్రాండ్ గా చేశారు టీమ్. ఈసందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు బాలీవుడ్  సీనియ‌ర్ న‌టీ నీనా గుప్తా.

27

 ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గోన్న నీనా గుప్తా..  త‌న కెరీర్‌లో ఆన్‌స్క్రీన్ లో తొలిసారి లిప్ కిస్ ఎక్స్ పీరియన్స్ ను శేర్ చేసుకుంది. అయితే ఆమె చెప్పిన విషయాలు విని షాక్ అయ్యారు టీమ్. తాను ముద్దు  సీన్‌లో న‌టించిన త‌రువాత నోటిని డెటాల్‌లో శుభ్రం చేసుకున్న‌ట్లు వెల్లడించింది.

37
Image: Neena Gupta / Instagram

నటీనటులు అనిపించుకునేవారు ఎలాంటి సీన్స్ అయినా చేయాల్సి ఉంటుంది అన్నారు నీనా గుప్తా. దాని కోసం  కొన్ని సార్లు బుర‌ద‌లోకి కూడా దిగాల్సి ఉంటుంది అన్నారు.  ఇంకొన్ని సార్లు గంట‌ల పాటు ఎండ‌లో నిల‌బ‌డాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే తనకు లిప్ కిస్ అనుభవం ఎవరితో అయ్యింది అనేది కూడా వెల్లడించింది నీనా గుప్తా. 

47
neena gupta

కొన్నేళ్ల క్రితం న‌టుడు దిలీప్ ధావ‌న్ క‌లిసి ఓ సీరియ‌ల్‌లో న‌టించాను. అయితే.. మా ఇద్ద‌రి మ‌ధ్య ఓ లిప్ కిప్ స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు. ఇండియ‌న్ టీవీ చ‌రిత్ర‌లో అదే మొద‌టి లిప్ కిప్ సీన్ కావొచ్చు. దీంతో ఆ రోజు రాత్రి అంతా నిద్ర‌పోలేక‌పోయాను అని నీనా చెప్పింది.

57
goodbye

కీస్ సీన్స్ చేయడం తనకు కంఫర్ట్ బుల్ గా ఉండదు అంటున్నారు నీనా గుప్తా. అప్పటికీ దిలీప్ ధావన్ తాను స్నేహితులం కాదు. పరిచయం కూడా లేదు. కేవలం ఒకరికి ఒకరం తెలుసు అంతే.. అటువంటి టైమ్ లో ముద్దు సీన్ చేయాలి అంటే అది అసౌర్యంగానే ఉంటుంది అన్నారు నీనా. అయితే అతను అందంగా ఉంటాడు. కాని ఆపరిస్థితుల్లో అందంతో పనిలేదు...అప్పటికి ఆ సీన్ కోసం నేను సిద్దంగా లేను అన్నారు నీనా

67

అంతే కాదు నిజానికి అప్పుడు  నేను మాన‌సికంగా, శారీర‌కంగా సిద్దంగా లేను. ఆ స‌న్నివేశాన్నిషూట్ చేసేప్పుడు చాలా టెన్ష‌న్‌గా ఉన్నాను. కొంద‌రు కామెడీ చేయ‌లేర‌ని, ఇంకొంద‌రు కెమెరా ముందు ఏడ‌వ‌లేర‌ని నాకు నేను ఆ స‌మ‌యంలో మ‌న‌సుకు స‌ర్ది చెప్పుకుని. ధైర్యంగా ముంద‌డు వేశా. అని తన ఫస్ట్ కిస్ ఆన్ స్క్రీన్ అనుభవాన్ని పంచుకుంది సీనియర్ నటి. 
 

77

అంతే కాదు ఈ సీన్ కంప్లీట్ అవ్వగానే  త‌న నోటిని డెటాల్‌తో బాగా శుభ్రం చేసుకున్న‌ట్లు తెలిపింది. అది నాకు క‌ష్టంగా అనిపించింది. తెలియ‌ని వారిని ముద్దు పెట్టుకున్నాను అని నీనా అంది. ఇక ఆ రాత్రి అంతా త‌న‌కు నిద్ర ప‌ట్ట‌లేదని కూడా ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఆమె వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories