శివకుమార్ మాట్లాడుతూ, "సూర్యకి లోయోలా కాలేజీలో బి.కామ్‌కి సీటు రాలేదు. నేను ప్రిన్సిపాల్‌ని కలిసి అడిగితే, శివాజీ గణేశన్ కొడుకు బి.కామ్ పూర్తిచేయలేదు, ఇంకొందరు ప్రముఖుల పిల్లలు కూడా అలాగే చేశారు, మీ అబ్బాయి కూడా అలాగే చేస్తాడని అన్నారు. నా కొడుకు బి.కామ్ పూర్తిచేస్తాడని చెప్పి సీటు తెచ్చుకున్నా. కానీ చివరి సంవత్సరంలో నాలుగు అరియర్స్ పెట్టుకున్నాడు. అబ్బాయ్, పరువు పోతుందని చెప్పా. ఎలాగో కష్టపడి బి.కామ్ డిగ్రీ తెచ్చుకున్నాడు" అని శివకుమార్ చెప్పగానే, సూర్య తలపట్టుకున్నారు.