కల్కి 2 వచ్చేలోపు ఇంకేదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా అని నాగ్ అశ్విన్ ని సుమ ప్రశ్నించింది. దీనితో నాగ్ అశ్విన్.. లేదు మరో సినిమా చేయను.. ఎందుకంటే కల్కి 2నే మూడు భారీ చిత్రాలకు సమానం... కాబట్టి టైం పడుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది అని నాగ్ అశ్విన్ ప్రకటించారు. సో నాగ్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం గమనిస్తే ప్రభాస్ ప్రస్తుతం కమిటైన చిత్రాలు పూర్తి చేసే వరకు కల్కి 2 స్క్రిప్ట్, అదే విధంగా ప్రీ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఈ సారి కల్కి 2 చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తంగా నాగ్ అశ్విన్ కల్కి 2 గురించి బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.