Allu Arjun త్రివిక్రమ్‌ కి ఝలక్‌ ఇచ్చిన కమల్‌ హాసన్‌.. శివ కార్తికేయన్‌తో `సేయాన్‌` మూవీ ప్రకటన

Published : Feb 16, 2026, 10:25 PM IST

Allu Arjun: `అమరన్‌` తర్వాత కమల్‌ హాసన్‌ నిర్మాణంలో శివకార్తికేయన్‌ `సేయాన్‌` అనే మూవీ చేస్తున్నారు. అయితే ఇది అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ లకు పెద్ద దెబ్బ అని టాక్‌. అది ఎలా అనేది చూస్తే 

PREV
15
కమల్‌ హాసన్‌ నిర్మాణంలో శివ కార్తియన్‌ మూవీ

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన  ‘అమరన్’ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.  ఈ సినిమా శివకార్తికేయన్  కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. ఇక ఇప్పుడు కమల్‌ నిర్మాణంలో శివకార్తికేయన్‌ హీరోగా మరో సినిమా రాబోతుంది. 

25
శివ కార్తికేయన్‌ హీరోగా `సేయాన్‌` మూవీ

శివకార్తికేయన్ 26వ చిత్రాన్ని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.  ఈ మూవీకి `సేయాన్‌` అనే పేరు పెట్టారు. శివకార్తికేయన్-కమల్ హాసన్ కాంబోలో ఇది రెండో సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

35
భారీ స్థాయిలో సేయాన్‌ మూవీ

శివకార్తికేయన్ నిర్మించిన 'తాయికిళవి' సినిమా దర్శకుడు శివకుమార్ మురుగేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈయన గతంలో 'కడైసి వివాసాయి' చిత్రానికి పనిచేశారు. గతేడాది బంపర్ హిట్ అయిన 'ఆన్ పావం పొల్లాదదు' సినిమాకు రచయిత కూడా. 'తాయికిళవి' కథ, చిత్రీకరణ, అవుట్‌పుట్ చూసి ఇంప్రెస్ అయిన శివకార్తికేయన్ వెంటనే ఈ దర్శకుడిని తన సినిమాకు తీసుకున్నారు. భారీ స్థాయిలో ఈ మూవీని ప్లాన్‌ చేస్తున్నారట. 

45
కుమారస్వామి కథతో `సేయాన్‌`

SK26 ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం విడుదల కానుండగా, అంతకంటే ముందే టైటిల్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చేతిలో వేల్ (శూలం లాంటి ఆయుధం) పట్టుకుని నిలబడిన ఫోటో ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ చిత్రానికి తమిళ దేవుడు మురుగన్ పేర్లలో ఒకటైన 'సేయాన్‌' అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ మురుగన్ భక్తుడిగా నటిస్తున్నట్లు సమాచారం. `గాడ్‌ ఆఫ్‌ వార్‌` అనే కథతోనే ఈ మూవీ రూపొందబోతుందట. కుమారస్వామి కథతోనే సినిమాని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 

55
అల్లు అర్జున్‌, త్రిక్రమ్‌ లకు కమల్‌ పెద్ద ఝలక్‌

శివ కార్తికేయన్‌ `సేయాన్‌` మూవీ ఇప్పుడు అల్లు అర్జున్‌ మూవీకి పెద్ద దెబ్బగా మారబోతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. `గాడ్‌ ఆఫ్‌ వార్‌` కథతోనే ఈ మూవీని రూపొందించాలని భావించారు. ఇది కుమారస్వామి కథ. మొదట ఎన్టీఆర్‌ తో చేయాలనుకున్నారు త్రివిక్రమ్‌. ఆ తర్వాత బన్నీ ఓకే చెప్పారట. దీంతో ఆయనతోనే ఈ సినిమా చేయాలని భావించారట.  కానీ ఊహించని విధంగా అటు బన్నీ, ఇటు త్రివిక్రమ్‌ కి ఝలక్ ఇస్తూ కమల్‌ హాసన్‌ తన ప్రొడక్షన్‌ లో ఈ `సేయాన్‌`మూవీని ప్రకటించారు. ఇది కూడా `గాడ్‌ ఆఫ్‌ వార్‌` కథే అని టాక్‌. ఇదే నిజమైతే బన్నీ, త్రివిక్రమ్‌లకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories