Brahmanandam: ‘గేమ్ ఛేంజర్’ పై బ్రహ్మానందం అదిరిపోయే సెటైర్

Published : Feb 16, 2025, 05:40 AM IST

 Brahmanandam:  గేమ్ ఛేంజర్ సినిమాలో తన పాత్ర గురించి బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
13
 Brahmanandam:  ‘గేమ్ ఛేంజర్’ పై బ్రహ్మానందం అదిరిపోయే సెటైర్
Brahmanandam Satire on Ram Charan Game Changer in telugu


 Brahmanandam:  రాం చరణ్  తాజా చిత్రం  గేమ్ ఛేంజర్ సినిమా ఈమధ్యనే రిలీజై నిరాశ పరచిన సంగతి తెలిసిందే.  ప్రముఖ తమిళ దర్శకుడు  శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా  భారీతనానికి కేరాఫ్ ఎడ్రస్ గా తెరకెక్కింది. కానీ పాతకాలం నేరేషన్, రొటీన్ సీన్స్ సినిమాని నిర్దాక్ష్యణంగా భాక్సాఫీస్ దగ్గర క్రింద పడేసాయి. దాంతో ఓటిటిలో సైతం ఆ సినిమాను లైట్ తీసుకున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో తన బెస్ట్ ఇచ్చాడు.

అయితే కథ,కథనం అతని నటనకు కలిసి రాలేదు. దాంతో చరణ్ కి పేరు వచ్చినా సినిమా ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమైంది. ఈ క్రమంలో ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. రీసెంట్ గా అల్లు అరవింద్ సైతం ఈ సినిమాపై సెటైర్స్ వేసి, క్షమాపణ చెప్పారు. ఇప్పుడు బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడి హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ బ్రహ్మీ ఏమన్నారో చూద్దాం. 
 

23
Brahmanandam Satire on Ram Charan Game Changer in telugu


టాలీవుడ్ వెటరన్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam)వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా మెగా హీరోలు, చిరంజీవి అంటే చాలా గౌరవం కనపరుస్తారు.

కానీ, రీసెంట్‌గా జరిగిన ఓ మీడియా మీట్‌లో బ్రహ్మానందం చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.  ‘గేమ్ ఛేంజర్’లో (Game Changer) బ్రహ్మానందం చిన్న పాత్రలో కనిపించడంపై ఓ మీడియా వ్యక్తి ప్రశ్నించగా.. ఆయన ఇచ్చిన రిప్లై మాత్రం సెన్సేషన్‌గా మారింది.

33
Brahmanandam Satire on Ram Charan Game Changer in telugu

“గేమ్ ఛేంజర్ లాంటి పెద్ద మూవీలో మీరు చిన్న క్యారెక్టర్ చేయడం చూసి షాక్ అయ్యాం సార్” అని మీడియా పర్సన్ బ్రహ్మానందంని అడగగా... వెంటనే బ్రహ్మానందం తనదైన శైలిలో కలుగజేసుకుని అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

“మీరు చూసింది చిన్న క్యారెక్టర్ కానీ నేను చేసింది పెద్ద క్యారెక్టర్” అంటూ పరోక్షంగానే శంకర్ టీమ్‌కు పంచ్ విసిరారు. ఇప్పడీ సెటైర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఆయన కనిపించింది కొద్దిసేపే.! అయినా, షూటింగ్‌ ఎక్కువ రోజులు చేసి ఉండొచ్చు. తర్వాత బ్రహ్మానందం పాత్రను సినిమాలో ఎడిట్ చేసి తొలిగించి ఉండొచ్చు   అని ఆ ఉద్దేశంతో ఆయన  చెప్పి ఉండొచ్చు.
 

Read more Photos on
click me!

Recommended Stories