అమరన్ సినిమా విజయం తర్వాత శివ కార్తికేయన్ మార్కెట్ జెట్ స్పీడ్ తో పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన నటించిన ఎస్.కె.23 సినిమా నిర్మాణంలో ఉంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా సిబి చక్రవర్తితో ఒక సినిమా, సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా, గుడ్ నైట్ సినిమా దర్శకుడితో ఒక సినిమా, వెంకట్ ప్రభుతో ఒక సినిమా ఇలా శివ కార్తికేయన్ సినిమాల జాబితా పెరుగుతూనే ఉంది.