లగ్జరీ కార్లు, భవనాలు, ఫార్మ్ హౌసులు, అనుష్క శెట్టి ఆస్తుల విలువ తెలిస్తే మీ మతిపోతుంది!

First Published | Nov 19, 2024, 4:52 PM IST

అనుష్క శెట్టి పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. సుదీర్ఘ కెరీర్లో అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఆమె ఇచ్చారు. ఇక అనుష్క ఆస్తుల వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. 
 


దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. వృత్తి రీత్యా యోగా టీచర్ అయిన అనుష్క సూపర్ మూవీ ఆడిషన్స్ కి హాజరైంది. ఒడ్డు పొడుగు ఉన్న అనుష్కను నాగార్జునకు జంటగా ఎంపిక చేశారు. అనుష్కను చూడగానే నాగార్జున హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారని ఓ సందర్భంలో పూరి జగన్నాధ్ వెల్లడించారు. సూపర్ మూవీ అనంతరం పలు చిత్రాల్లో అనుష్క నాగార్జునతో జతకట్టింది. 
 


విక్రమార్కుడు మూవీ అనుష్కకు బ్రేక్ ఇవ్వగా... అరుంధతి, బిల్లా, మిర్చి చిత్రాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరింది. బాహుబలి సిరీస్ తో ఆమె ఇండియా వైడ్ పాప్యులర్ అయ్యారు. వివాదరహితురాలుగా పేరున్న అనుష్క, రెమ్యునరేషన్ కూడా రీజనబుల్ గా తీసుకుంటారని సమాచారం. 
 


Anushka Shetty

అనుష్క ప్రస్తుతం సినిమాకు రూ. 6 కోట్ల వరకు తీసుకుంటుంది. అనుష్క స్థిర చర ఆస్తులు పరిశీలిస్తే.. ఆమెకు హైదరాబాద్ లో రూ. 12 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. అలాగే నగర శివారులో ఒక ఫార్మ్ హౌస్ ఉందని సమాచారం. అనుష్కకు బెంగుళూరు, మంగుళూరు నగరాల్లో కూడా ఇళ్ళు ఉన్నట్లు వినికిడి. 

అనుష్క శెట్టి వద్ద లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది. టయోటా కరోలా ఆల్టిస్ కారు ఉంది. దీని విలువ రూ. 20 లక్షలు. అలాగే  రూ. 59.88 లక్షల విలువైన ఆడి క్యూ5 ఉంది.  రూ. 59 లక్షలు చేసే ఆడి ఏ6 ఒకటి ఉంది. బీఎండబ్ల్యూ 6 సిరీస్ ఒకటి ఉంది. దీని ధర రూ.  70 లక్షలు  అని సమాచారం. 
 

అనుష్క నెలకు కోటి రూపాయలు తగ్గకుండా సంపాదిస్తుంది. 2022 లో ఆమె ఆస్తి విలువ రూ. 124 కోట్లుగా అంచనా వేశారు. 2023 కి అది రూ. 134 కోట్లకు చేరింది. ఇది అనుష్క శెట్టి మొత్తం ఆస్తుల విలువ అని సమాచారం. అనుష్క ఆస్తుల విలువ ఈ ఏడాదికి ఇంకా పెరిగి ఉండొచ్చు అని ఒక అంచనా. 

Anushka Shetty

బాహుబలి అనంతరం అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తుంది.2017లో  బాహుబలి 2 విడుదల కాగా భాగమతి, నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె క్రిష్ దర్శకత్వంలో ఘాటీ టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. 

Anushka Shetty

సైజ్ జీరో సినిమాలో సహజంగా కనిపించడం కోసం అనుష్క బరువు పెరిగారు. అది అనుష్క తీసుకున్న రాంగ్ డెసిషన్. ఎంత ప్రయత్నం చేసినా అనుష్క పూర్వ స్థితికి రాలేకపోయింది. ఇప్పుడు కూడా అనుష్క చాలా లావుగా కనిపిస్తున్నారు. అనుష్క పెళ్లి మాట ఎత్తడం లేదు. ఇందుకు కారణం తెలియదు...

Latest Videos

click me!