శివకార్తికేయన్‌, మురుగదాస్‌ మూవీకి అదిరిపోయే టైటిల్‌, ఓల్డ్ సెంటిమెంట్‌ని ఫాలో అవ్వడానికి కారణమదేనా?

Published : Feb 16, 2025, 05:26 PM IST

Sivakarthikeyan  SK23 Movie Title : ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటుడు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న SK 23 సినిమా టైటిల్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది.

PREV
14
శివకార్తికేయన్‌, మురుగదాస్‌ మూవీకి అదిరిపోయే టైటిల్‌, ఓల్డ్ సెంటిమెంట్‌ని ఫాలో అవ్వడానికి కారణమదేనా?
SK 23 సినిమా టైటిల్

Sivakarthikeyan  SK23 Movie Title : తమిళ సినీ పరిశ్రమలో ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు శివకార్తికేయన్. ఆయన నటించిన రెండు సినిమాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో ఒకదానికి ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మరొకదానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. కాబట్టి తాత్కాలికంగా SK 23 అని పిలుస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న సినిమాకి `పరాశక్తి` అని పేరు పెట్టారు.

24
శివకార్తికేయన్ పరాశక్తి

తన సినిమాలకు పాత సినిమా టైటిళ్లనే వరుసగా పెడుతున్న శివకార్తికేయన్, తన 25వ సినిమాకి `పరాశక్తి` అని పేరు పెట్టడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ టైటిల్ ఎవరికీ ఇవ్వమని శివాజీ నటించిన `పరాశక్తి `సినిమాను నిర్మించిన నేషనల్ పిక్చర్స్ సంస్థ తేల్చి చెప్పింది. అయినప్పటికీ అదే టైటిల్‌తో శివకార్తికేయన్ సినిమా పనులు జరుగుతుండటంతో విడుదల సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

 

34
పాత సినిమా టైటిళ్లను ఇష్టపడే శివకార్తికేయన్

`పరాశక్తి`తో పాటు, శివకార్తికేయన్ నటించిన `ఎతిర్నీచ్చల్, కాకీ సట్టై, వేలైక్కారన్, మావీరన్, అమరన్` వంటి సినిమాల టైటిళ్లు కూడా పాత సినిమాల నుంచే తీసుకున్నవే. ఈ క్రమంలో శివకార్తికేయన్ 23వ సినిమా టైటిల్ కూడా పాత సినిమా టైటిల్‌గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫిబ్రవరి 17న నటుడు శివకార్తికేయన్ పుట్టినరోజున ఆ సినిమా టైటిల్‌ను ప్రటించబోతున్నారు. 

44
SK 23 టైటిల్ శిఖరం?

ఆ టైటిల్ ఏమిటనేది ఇప్పుడు లీక్ అయ్యింది. SK 23 సినిమాకి `శిఖరం` అని పేరు పెట్టారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే `శిఖరం` పేరుతో 1981లో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నటించిన సినిమా విడుదలైంది. ఆ సినిమాకి అనందు దర్శకత్వం వహించారు. ఆ సినిమాకి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించారు.

ఇప్పుడు 44 ఏళ్ల తర్వాత అదే టైటిల్ శివకార్తికేయన్ సినిమాకి పెట్టారని చెబుతున్నారు. ఇలా వరుసగా ఓల్డ్ మూవీస్‌ టైటిల్‌ పెట్టడానికి సక్సెస్‌సెంటిమెంటే కారణమని తెలుస్తుంది. ఇలాంటి పేరుతో వచ్చిన సినిమాలన్నీ చాలా వరకు సక్సెస్‌ అయ్యాయి. అందుకే ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. 

read more:ప్రభాస్‌ సినిమాకి మంచు విష్ణు ఆడిషన్‌, నెటిజన్ల ట్రోలింగ్‌, ఇవన్నీ అవసరమా?

also read: చిరంజీవి సినిమా చేయాలనుకుంటున్న రూ.1200కోట్ల డైరెక్టర్ ఎవరో తెలుసా? కుదిరితే సంచలనమే!

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories