Sivaji VS Anasuya: ఆ విధంగా అనసూయ రుణం త్వరలోనే తీర్చుకుంటా..ఈసారి ఇంకా ఘాటుగా శివాజీ కామెంట్స్

Published : Dec 24, 2025, 05:47 PM IST

నటుడు శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనసూయకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. త్వరలోనే ఆమె రుణం తీర్చుకుంటా అంటూ శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

PREV
15
శివాజీ కాంట్రవర్సీ 

ప్రముఖ నటుడు శివాజీ నటించిన దండోరా చిత్రం డిసెంబర్ 25న అంటే మరికొన్ని గంటల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ హీరోయిన్లు ధరించే బట్టల గురించి మాట్లాడుతూ సామాన్లు అంటూ అభ్యంతరకర పదాలు ఉపాయోగించారు. దీనితో పెద్ద వివాదం చెలరేగింది. శివాజీ కామెంట్స్ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మహిళా కమిషన్ రంగంలోకి దిగడంతో శివాజీ స్వయంగా తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. 

25
అనసూయ కౌంటర్ 

అయినా కూడా ఈ రచ్చ ఆగలేదు. దీనితో మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. శివాజీ వ్యాఖ్యలని పలువురు ఖండిస్తున్న సంగతి తెలిసిందే. అనసూయ స్పందిస్తూ శివాజీ గారు ఇన్సెక్యూరిటీతో ఉన్నారని ఆయన్ని చూస్తుంటే జాలి వేస్తోంది అని, శివాజీ చెప్పినంత మాత్రాన మనం వింటామా ఏంటి అంటూ కౌంటర్ ఇచ్చింది. శివాజీ తన వ్యాఖలపై స్పందిస్తూ ఇటీవల నిధి అగర్వాల్ లులు మాల్ కి వెళ్ళినప్పుడు ఊహించని సంఘటన జరిగింది. 

35
అందుకే అలా మాట్లాడాను 

అక్కడ జరగరానిది జరిగి ఉంటే ఆమె జీవితాంతం బాధపడేది. అలాంటి సంఘటనలని దృష్టిలో పెట్టుకుని ఆడవాళ్లు నిండుగా బట్టలు వేసుకుంటే మంచిది కదా అని చెప్పాను. ఆ క్రమంలో అన్ పార్లమెంటరీ మాట మాట్లాడాను. నేను చేసిన తప్పు అదే. కానీ నేను మంచి ఉద్దేశంతోనే బట్టల గురించి మాట్లాడాను అని శివాజీ అన్నారు. 

45
అసలు అనసూయకి ఏం సంబంధం 

శివాజీ మాట్లాడుతూ.. అసలు ఇందులోకి అనసూయ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. మీకెందుకు అనసూయ గారు, నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా అమ్మా. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న వారందరికీ థాంక్యూ. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఇన్సెక్యూరిటీ ఉంది. మా హీరోయిన్లు అలా బయటకి వెళ్ళినప్పుడు జరగరాని సంఘటన జరుగుతుందేమో అనే ఇన్సెక్యూరిటీ ఉంది. 

55
అనసూయ రుణం తీర్చుకుంటా 

అదే విధంగా అనసూయ గారు నాపై జాలి చూపించారు. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకున్న విశాల హృదయానికి భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతున్నా. త్వరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా అంటూ పరోక్షంగా శివాజీ అనసూయకి కౌంటర్ ఇచ్చారు. ఏ విధంగా రుణం తీర్చుకుంటారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఎవరన్నా ఆమెని బయట ఇబ్బంది పెడితే ఇది తప్పు అని ఖండించే అవకాశం తనకి రావాలి అని శివాజీ సమాధానం ఇచ్చారు. ఈసారి శివాజీ వ్యాఖ్యలపై అనసూయ ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. 

Read more Photos on
click me!

Recommended Stories