తనూజని కళ్యాణ్‌ టచ్‌ చేస్తే నీకేంటి ప్రాబ్లమ్‌.. రమ్య మోక్షకి చుక్కలు చూపించిన శివాజీ

Published : Oct 27, 2025, 03:00 PM IST

ఏడో వారం బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన రమ్య మోక్ష.. తనూజ, కళ్యాణ్‌లపై హాట్ కామెంట్‌ చేసింది. దీంతో శివాజీ ఆమెని ఒక రేంజ్‌లో ఆడుకున్నాడు. నువ్వు చెప్పిందేంటి? చేసిందేంటి? అని ప్రశ్నించారు. 

PREV
14
రమ్య మోక్షకి చుక్కలు చూపించిన శివాజీ

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌ నుంచి ఏడో వారం రమ్య మోక్ష ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ఆమె ఎలిమినేషన్‌ జరిగింది. కాకపోతే రమ్య మోక్ష ఎలిమినేషన్‌ విషయంలో అంతా హ్యాపీ అవుతున్నారు బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్. ఆమెని హౌజ్‌ నుంచి పంపించి మంచి పనే చేశారని అంటున్నారు. అదే సమయంలో రమ్య మోక్షని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. షోలోకి వెళ్లేముందు ఆమె ఏం చెప్పింది, వెళ్లాక ఏం చేసిందంటూ ప్రశ్నించారు. అయితే తాజాగా శివాజీ కూడా ఆమెని అదే విషయంలో నిలదీశాడు. బిగ్‌ బాస్‌ బజ్‌ లో పాల్గొన్న రమ్యని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఓ రకంగా చుక్కలు చూపించాడని చెప్పొచ్చు.

24
తనూజ, కళ్యాణ్‌, రీతూ, పవన్‌లను చూసి విసుకొచ్చింది

రమ్య మోక్ష ఎలిమినేట్‌ అయిన వెంటనే బిగ్‌ బాస్‌ బజ్‌లో హోస్ట్ శివాజీ ఇంటర్వ్యూ చేశాడు. తన సూటి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఇప్పుడు రమ్యని ఓ రేంజ్‌లో ఆడుకోవడం విశేషం. సమాధానం చెప్పలేక రమ్య ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ టాక్‌ షో స్టార్ట్ అయినప్పట్నుంచి ప్రశ్నలతో దాడికి దిగాడు శివాజీ. బిగ్ బాస్‌ హౌజ్‌లో కొందరిపై ఉన్న నెగటివిటీని బ్రేక్‌ చేస్తానని వెళ్లి నువ్వే నెగటివిటీని మూటగట్టుకున్నావని శివాజీ అడగ్గా.. తాను సాధ్యమైనంత వరకు ఎంటర్‌టైన్‌ చేశానని, ఇమ్మాన్యుయెల్‌తో స్కిట్‌ కూడా వేశామని తెలిపింది రమ్య. ఫిజికల్‌ టాస్క్ ల్లోనూ తాను బాగానే ఆడినట్టు తెలిపింది. తనూజ, కళ్యాణ్‌లను, రీతూ-పవన్‌లను టార్గెట్ చేయడానికి హౌజ్‌కి వెళ్లావా? అని శివాజీ ప్రశ్నించగా, వాళ్లు చేస్తున్నవి చూసి విసుగు వచ్చిందని, దాన్ని బ్రేక్‌ చేయాలని ప్రయత్నించినట్టు తెలిపింది రమ్య.

34
తనూజని కళ్యాణ్‌ టచ్‌ చేస్తే నీకు ప్రాబ్లమ్‌ ఏంటి?

గేమ్‌లు ఆడమంటే సుమన్‌కి దగ్గరయ్యే ప్రయత్నం చేశావని అడగ్గా, ఆయన కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నాడని, అలా ఉండే వాళ్లని ఓదార్చే ప్రయత్నం చేసినట్టు తెలిపింది. అయితే ఓదార్పు యాత్ర కోసం వచ్చావా అంటే, ఎవరైనా ఒంటరిగా ఉంటే తాను చూడలేనని తెలిపింది. ఈ సందర్భంగా తనూజని కళ్యాణ్ టచ్‌ చేస్తే నీకేంటి? ఎందుకు అలా రియాక్ట్ అయ్యావని అడిగితే, ఆమె చాలా ఇబ్బంది పడిందని, ఆమె ఆ ఇబ్బందిని చెప్పదని, దాటవేస్తూ వెళ్తుందని, అది తాను స్వయంగా చూసినట్టు తెలిపింది రమ్య. అందుకే ఆ విషయాలను చెప్పినట్టు వెల్లడించింది. కళ్యాణ్‌ ని అమ్మాయిల పిచ్చోడు అని కామెంట్‌ చేయడాన్ని ప్రశ్నించగా, ఇప్పటికీ తన అభిప్రాయం అదే అని, కానీ ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఆ విషయంలో కళ్యాణ్‌కి సారీ చెప్పానని తెలిపింది రమ్య.

44
బిగ్‌ బాస్‌ లవర్స్ పార్క్ లా మారింది

రీతూ, పవన్‌ లను చూసి బిగ్‌ బాస్‌ హౌజ్‌ తనకు లవర్స్ పార్క్ లా అనిపించిందని, దాన్ని బ్రేక్‌ చేయాలని అనుకున్నట్టు చెప్పింది. అయితే వాళ్లని విడగొట్టాలని చూశావు, మరీ నువు పవన్‌తో పులిహోర ఎందుకు కలిపావు అని ప్రశ్నించాడు శివాజీ. దీనికి తాను అలా చేయలేదని చెప్పింది. దీంతో వెంటనే వీడియో చూపించాడు శివాజీ. దెబ్బకి ఖంగుతిన్న రమ్య.. దాన్ని కవర్‌ చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగానే నువ్వు బిగ్‌ బాస్‌ షో చూడకుండానే హౌజ్‌కి వెళ్లినట్టు తనకు అర్థమయ్యిందని కౌంటర్‌ వేశాడు శివన్న. హౌజ్‌కి వెళ్లి గాసిప్‌ రాణిలా మారిపోయావని, వాళ్లు ఇది, వీళ్లు అది అంటూ చెప్పావ్‌ తప్ప, నువ్వు ఎంటర్‌టైన్‌ చేయలేదని, నీ ఆట ఆడలేకపోయావని స్పష్టం చేశాడు శివాజీ. అదే సమయంలో లైఫ్‌లో ఎప్పుడైన ఆచితూచి మాట్లాడాలని తెలిపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories