ముద్దుమాటలు చెప్పి చెవిలో మందారం పెడుతున్నావ్‌.. తనూజ పరువు తీసిన మర్యాద మనీష్‌.. హౌజ్‌లోకి మాజీ కంటెస్టెంట్లు

Published : Oct 27, 2025, 12:00 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ప్రియా, మర్యాద మనీష్‌, శ్రీజ, ఫ్లోరా హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లు ఎందుకు వచ్చారంటే? 

PREV
15
మళ్లీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షో ట్విస్ట్ లు టర్న్ లతో సాగుతుంది. వారం వారం కొత్త ట్విస్ట్ లతో సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు బిగ్‌ బాస్‌. ఎప్పుడ ఏం చేయబోతున్నారో ఊహించడం కూడా కష్టంగానే ఉంది. గడిచిన ఏడు వారాల్లోనే చాలా ట్విస్ట్ లు ఇచ్చారు. దాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఎనిమిదో వారంలో మరో ట్విస్ట్ ఇచ్చారు. మాజీ కంటెస్టెంట్లని హౌజ్‌లోకి తీసుకొచ్చారు. ఈ సీజన్‌లో ఎలిమినేట్‌ అయిన వారినే మళ్లీ హౌజ్‌లోకి తీసుకురావడం ఆశ్చర్యపరుస్తోంది.

25
హౌజ్‌లోకి వచ్చిన మాజీ కంటెస్టెంట్లు వీరే

మళ్లీ హౌజ్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లలో ప్రధానంగా నలుగురు ఉన్నారు. ప్రియా, మర్యాద మనీష్‌, ఫ్లోరా, శ్రీజని మరోసారి బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి తీసుకురావడం విశేషం. అయితే వీళ్లు  నామినేషన్‌ కోసం రావడం విశేషం. హౌజ్‌లో ఉన్న వాళ్లని నామినేట్‌ చేయడమే కాదు, ఉండిపోనున్నారట. సోమవారం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందనే విషయం తెలిసిందే. రెగ్యూలర్‌గా అయితే హౌజ్‌లోని కంటెస్టెంట్లే ఇద్దరు కంటెస్టెంట్లని నామినేట్‌ చేస్తారు. హౌజ్‌లో వీళ్లు ఉండేందుకు అర్హులు కారు అని చెబుతుంటారు. దానికి సరైన కారణాలు చెబుతుంటారు. అయితే ఈ సారి నామినేషన్‌ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్లు కాదు, ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు చేయబోతున్నారు. ఎవరిని నామినేట్‌ చేయాలో వాళ్లు డిసైజ్‌ చేయబోతున్నారు. 

35
సంజనా, కళ్యాణ్‌ లను నామినేట్‌ చేసిన ప్రియా, మనీష్‌

సోమవారం ఎపిసోడ్‌లో హౌజ్‌లోకి వచ్చిన మాజీ కంటెస్టెంట్లు ఇన్నిరోజులు షోని చూసి, వాళ్ల అబ్జర్వేషన్‌ ప్రకారం ఎవరు వీక్‌ ఉన్నారు, ఎవరు హౌజ్‌లో ఉండేందుకు అర్హులు కారో చెప్పబోతున్నారు. ఇందులోసంజనాని ప్రియా, కళ్యాణ్‌ని మర్యాద మనీష్‌ నామినేట్‌ చేశారు. మీరు మాట్లాడితే చాలా బాడీ షేమింగ్‌ చేస్తున్నారని సంజనాని ఉద్దేశించి చెప్పింది ప్రియా. ఆర్టిస్ట్ లాగా హౌజ్‌లో ఉండటం సెట్ కాదన్నారు. ఇమ్మాన్యుయెల్‌ విషయంలో నువ్వు చేసింది తప్పు అని కళ్యాణ్‌ని మర్యాద మనీష్‌ తెలిపారు. అదే సమయంలో ఇమ్మాన్యుయెల్‌కి నువ్వు వెన్నుపోటు పొడిచావని తెలిపారు మనీష్‌.

45
తనూజ రియాలిటీ బయటపెట్టిన మనీష్‌

దీంతోపాటు కంటెస్టెంట్లు కూడా నామినేట్ చేశారు. అయితే హౌజ్‌లోకి వచ్చిన మాజీ కంటెస్టెంట్లు ఒకరిని డైరెక్ట్ గా వాళ్లే నామినేట్‌ చేయగా, మరోటి ఇతర హౌజ్‌లోని కంటెస్టెంట్ల కూడా ఇచ్చారు. అలా మనీష్‌.. మరో నామినేషన్‌ ఛాన్స్ ని ఇమ్మాన్యుయెల్‌కి ఇవ్వగా, ఆయన తనూజని నామినేట్‌ చేశారు. దీంతో వీరిమధ్య గట్టిగా గొడవ జరిగింది. ఈ విషయంలో మనీష్‌ స్పందిస్తూ, ముద్దు మాటలు చెప్పి మందార పువ్వులను చెవిలో పెడుతున్నారని కామెంట్‌ చేయడం షాకిచ్చింది. ఇక ప్రియా మరో నామినేషన్‌ అవకాశం కళ్యాణ్‌కి ఇవ్వగా, ఆయన రాము రాథోడ్‌ని నామినేట్‌ చేశాడు. లాస్ట్ వీక్‌ చేసింది కరెక్ట్ కాదని రాముకి కళ్యాణ్‌ చెప్పగా, నువ్వు వెళ్లకపోయినా నేను కెప్టెన్‌ కాలేను అని, చివరికి నువ్వు కూడా కెప్టెన్‌ కాలేదు కదా అని చెప్పగా, ఇవే వద్దు, ఈ పోటీలే వద్దు అని కళ్యాణ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

55
హౌజ్‌లో ఉండబోతున్న మాజీ కంటెస్టెంట్లు ఎవరు?

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఇది ఆసక్తికరంగా మారింది. వీరితోపాటు ఫ్లోరా, శ్రీజలకు సంబంధించిన నామినేషన్‌ మరో ప్రోమోలో చూపించనున్నారు. ఇదిలా ఉంటే ఇందులో మరో ట్విస్ట్ ఉంది. హౌజ్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లు మళ్లీ హౌజ్‌లోనే ఉండబోతున్నారట. వీరిలో కొందరు కంటెస్టెంట్లు హౌజ్‌లోనే ఉండనున్నట్టు బిగ్‌ బాస్‌ తెలిపారు. మరి ఆ ఇద్దరు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి ట్విస్ట్ లు హౌజ్‌లో బాగానే ఉన్నాయి. కానీ ఇవి ఆడియెన్స్ కి ఎంగేజ్‌ చేయలేకపోతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories