పూజ గదిలో చేయకూడని పని, బిగ్ బాస్ అషురెడ్డి తీరుకు దుమ్మెత్తి పోస్తున్న జనాలు! ఇంతకీ ఏం చేసిందో తెలుసా?

First Published | Aug 18, 2024, 5:47 PM IST

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి చేసిన పనికి నెటిజెన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. పవిత్రమైన పూజ గదిలో ఇవేమి చర్యలంటూ మండిపడుతున్నారు. ఇంతకీ అషురెడ్డి ఏం చేసిందో చూద్దాం.. 
 


కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అషురెడ్డి. ఆమె సెన్సేషన్ కోసం చేయకూడని పనులు చేస్తుంది. ఒకప్పటి ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ బిగ్ బాస్ షో వేదికగా పాప్యులర్ అయ్యింది. అషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్ట్ చేసింది. గ్లామర్ షోనే నమ్ముకున్న అషురెడ్డి పెద్దగా రాణించలేదు. తక్కువ వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది. 

అయినప్పటికీ బిగ్ బాస్ షో ఆమె ఫేమ్ ని రెట్టింపు చేసింది. బుల్లితెర మీద కొన్నాళ్ళు సందడి చేసింది. అలాగే ఒకటి రెండు చిత్రాల్లో అషురెడ్డి నటించింది. తన పేరు ఎప్పుడూ మీడియాలో హైలెట్ అయ్యేలా అషురెడ్డి వివాదాస్పద చర్యలకు పాల్పడుతుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూలలో పాల్గొని రచ్చ రేపింది. 



అడల్ట్ లాంగ్వేజ్ తో కూడిన వర్మ-అషురెడ్డి ఇంటర్వ్యూల పై జనాలు మండిపడ్డారు. తరచుగా అషురెడ్డి మితిమీరిన గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. వీటిపై నెటిజెన్స్ అసభ్యకర కామెంట్స్ చేస్తారు. అవేమీ అషురెడ్డి పట్టించుకోదు. తన పంథాలో ముందుకు వెళుతుంది. తప్పు నా బట్టల్లో లేదు చూసే మీ కళ్ళలో ఉందంటూ కౌంటర్స్ వేస్తుంది. 
 

Ashu Reddy

తాజాగా అషురెడ్డి చేసిన పని మరింత వివాదాస్పదం అవుతుంది. వరలక్ష్మి వ్రతం హిందువుల పవిత్ర పండుగ దినం. యువతులు, మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. భక్తిశ్రద్దలతో వరలక్ష్మిని పూజిస్తారు. అషురెడ్డి అందుకు భిన్నంగా పూజ నిర్వహించి హిందువుల మనోభావాలు దెబ్బతీసింది. 

Ashu Reddy

అసభ్యకరంగా ఉన్న మోడ్రన్ డ్రెస్ లో వరలక్ష్మి వ్రతం చేస్తూ అషురెడ్డి కనిపించింది. పూజ గదిలో గ్లామర్  షోకి తెరలేపింది. ఈ ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. సదరు ఫోటోలపై నెటిజెన్స్ మండిపడుతున్నారు. నువ్వు చేసే పూజ ఏంటి? ఆ బట్టలు ఏంటి? అని కామెంట్స్ తో దాడికి దిగారు. అషురెడ్డి వివాదాస్పద ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

అసభ్యకర దుస్తుల్లో పూజలు చేస్తే నెగిటివ్ కామెంట్స్ వస్తాయని అషురెడ్డికి తెలుసు. వివాదం అవుతుందని తెలిసి కూడా ఇలా పూజ చేసింది. పబ్లిసిటీ పిచ్చితో అషురెడ్డి విలువలు వదిలేస్తుందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో తప్పితే, బుల్లితెరపై అషురెడ్డి పెద్దగా కనిపించడం లేదు. 

Latest Videos

click me!