ఇక గేమ్ చివర్లో గౌతమ్, శివాజీ, అర్జున్ మిగులుతారు. శివాజీకి గౌతమ్ బొమ్మ దొరుకుతుంది. శివాజీ వెళ్లకుండా బయటే ఉండిపోతాడు. దీనితో గౌతమ్ అవుట్ అవుతాడు. చివరకి శివాజీ, అర్జున్ మిగిలి కెప్టెన్సీ కంటెండర్స్ గా అర్హత పొందుతారు. శివాజీ చేసిన పనికి గౌతమ్ బాగా హర్ట్ అయ్యాడు. దీనితో శివాజీ కావాలనే తనని టార్గెట్ చేశాడని గౌతమ్ కి కోపం వస్తుంది వాళ్ళిద్దరి వాగ్వాదం చాలా భయంకరంగా సాగుతుంది. గట్టిగా అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూకేంతగా వెళ్తారు.