మళ్లీ ప్రెగ్నెంట్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌..? ఈ ఫోటోనే అందుకు కారణం..

Published : Nov 10, 2023, 06:46 PM ISTUpdated : Nov 10, 2023, 07:27 PM IST

అనుష్క శర్మ, విరాట్‌ కొహ్లీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చారు. ఇప్పుడు ఈ జంట మరోసారి ప్రెగ్నెంట్‌ కాబోతుందట. ఫోటోతో హింట్‌ ఇచ్చింది అనుష్క.   

PREV
16
మళ్లీ ప్రెగ్నెంట్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌..? ఈ ఫోటోనే అందుకు కారణం..

ఇండియాలో అత్యంత క్రేజ్‌ ఉన్న రంగాలు సినిమా, క్రికెట్‌. సెలబ్రిటీ హోదాని అనుభవించి ఈ రెండు రంగాల వారు కలిస్తే నిజంగానే క్రేజీగా ఉంటుంది. అందుకు నిదర్శనమే విరాట్‌ కొహ్లీ, అనుష్క శర్మ జంట. ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో ఇలా కొన్ని జరిగినప్పటికీ, ఈ జంట చాలా స్పెషల్‌గా నిలిచింది. వీరి క్రేజ్‌ మాత్రం నెక్ట్స్ లెవల్‌ అనే చెప్పాలి. 

26

అనుష్క, విరాట్‌ కొహ్లీ ప్రేమకి నిదర్శనంగా రెండేళ్ల క్రితం కూతురు వామిక జన్మించింది. అనుష్క పూర్తిగా తన పాపని చూసుకోవడానికే పరిమితమయ్యింది. సినిమాలు కూడా తగ్గించింది. ఒకటి అర చిత్రాల్లోనే మెరుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరి ఫ్యాన్స్ ఖుషి అయ్యే వార్త చక్కర్లు కొడుతుంది. అనుష్క శర్మ ప్రగ్నెంట్‌ అయ్యేందనేది ఆ వార్త సారాంశం. 
 

36

అనుష్క శర్మ మళ్లీ ప్రెగ్నెంట్‌ అయ్యిందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల అనుష్క ఓ ఫోటోని పంచుకోవడమే అందుకు కారణంగా చెప్పొచ్చు. అనుష్క.. ఆ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ఫోన్‌ ప్రమోషన్‌లో భాగంగా ఓ పిక్‌ని పంచుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇందులో మరో ఫోటో షేర్‌ చేసింది. అది నిజంగానే ప్రెగ్నెంట్‌ అనేలా ఉండటం విశేషం. 
 

46

అంతేకాదు దీనికితోడు ఇటీవల కొహ్లీ, అనుష్క ఓ హోటల్‌లో సందడి చేశారు. ఇందులో వాళ్లిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇందులో అనుష్క బ్లాక్‌ డ్రెస్‌ ధరించింది, అది చాలా లూజ్‌గా ఉంది. ఆ వీడియోలో అనుష్క బేబీ బంప్‌ కనిపించేలా ఉండటం విశేషం. దీంతో అనుష్క మళ్లీ ప్రెగ్నెంట్‌ అయ్యిందనే నిర్ధారణకు వస్తున్నారు నెటిజన్లు. 

56

ఇదిలా ఉంటే గతంలో ఇండియా మ్యాచ్‌లు జరిగే సమయంలో అనుష్క స్టేడియంకి వచ్చేది. అందులో కొహ్లీకి ఎంకరేజ్‌గా వ్యవహరించేది. కానీ ఈ మధ్య ఆమె రావడం లేదు. స్టేడియంలో కనిపించడం లేదు. దీంతో ఈ రూమర్లు నిజమే అనేది అంతా ఫిక్స్ అవుతున్నారు. దీనికితోడు ఆమె లుక్‌ కూడా అలానే ఉండటంతో మొత్తానికి విరూష్క జోడీ మరోసారి పేరెంట్స్ కాబోతున్నారని అంటున్నారు. 
 

66

కొహ్లీ అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాలో 2023 ప్రపంచ కప్‌లో టాప్‌లో నిలిపారు. ఆయన ఆట తీరు అందరిచేత ప్రశంసలందుకుంటుంది. అంతేకాదు క్రికెట్‌ దేవుడు సచిన్‌ రికార్డులను బ్రేక్‌ చేసే దిశగా వెళ్తున్నాడు. మరోవైపు అనుష్క శర్మ.. చాలా గ్యాప్‌తో `చక్డా` ఎక్స్ ప్రెస్‌` చిత్రంలో నటించింది. ఇది త్వరలో రాబోతుంది. ఆ మధ్య `ది రొమాంటిక్స్` అనే వెబ్‌ సిరీస్‌లోనూ మెరిసింది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories