నా పాటని వేస్ట్ చేశారు.. రాజమౌళి, కీరవాణిలపై శివ శక్తి దత్తా సంచలన వ్యాఖ్యలు

Published : Jul 14, 2025, 08:18 PM IST

రైటర్‌ శివశక్తి దత్తా దర్శకుడు రాజమౌళి, కీరవాణిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పాటని వేస్ట్ చేశారని, తనకు పాట నచ్చలేదంటూ హాట్‌ కామెంట్‌ చేశారు. 

PREV
15
`ఆర్‌ఆర్‌ఆర్‌`పై శివ శక్తి దత్తా కామెంట్స్ వైరల్‌

ఆస్కార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి తండ్రి, రైటర్‌ శివ శక్తి దత్తా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శివ శక్తి దత్తా కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.

 `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాలో ఆయన రాసిన పాటకు సంబంధించిన శివ శక్తి దత్తా చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

25
`ఆర్‌ఆర్‌ఆర్‌`లోని `నాటు నాటు` పాటకి ఆస్కార్‌

రాజమౌళి దర్శకత్వంలో `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ రూపొందింది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటించారు. డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మించారు. 

ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఇందులోని పాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. బ్లాక్‌ బస్టర్‌గా నిలిచాయి. ముఖ్యంగా `నాటు నాటు` పాట ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. 

ఏకంగా ఆస్కార్‌ అవార్డుని సొంతం చేసుకుంది. ఈ పాట రాసిన చంద్రబోస్‌, మ్యూజిక్‌ కంపోజ్‌ చేసిన కీరవాణి ఆస్కార్‌ని అందుకున్నారు.

35
`రామమ్‌ రాఘవం`పై పాటపై రైటర్‌ శివ శక్తి దత్తా కామెంట్స్

`ఆర్ఆర్‌ఆర్`లోని `నాటు నాటు` పాటకి ఆస్కార్‌ అవార్డు వరించిన సమయంలో 10టీవీతో శివ శక్తి దత్తా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

 `ఆర్‌ఆర్‌ఆర్‌`లో శివ శక్తి దత్తా `రామమ్‌ రాఘవం` అనే పాటని రాశారు. అయితే ఈ పాటని వేస్ట్ చేశారని, సరిగా కంపోజ్‌ చేయలేదని, అది తనకు నచ్చలేదని తెలిపారు శివ శక్తి దత్తా.

45
నా పాటని వేస్ట్ చేశారు, ఆ పాట అస్సలు నచ్చలేదుః శివ శక్తి దత్తా

ఆయన మాట్లాడుతూ, `నా పాట ట్యూన్‌ నచ్చ లేదు, పాట పిక్చరైజేషన్‌ నచ్చలేదు. ఆ పాటని వాళ్లు(రాజమౌళి, కీరవాణి) సరిగా ఉపయోగించలేదు. 

పాట మొత్తం మిస్‌ యూజ్‌ అయ్యింది. ఓ రకంగా పాటని వేస్ట్ చేశారు` అని తెలిపారు శివ శక్తి దత్తా. ఆయన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

`రామమ్‌ రాఘవం` పాట `ఆర్‌ఆర్‌ఆర్‌`లో క్లైమాక్స్ లో వస్తుంది.రామ్‌ చరణ్‌ నటించిన రామరాజు పాత్ర బ్రిటీష్‌ జైల్లో ఉన్న నేపథ్యంలో వారి నుంచి తప్పించుకుని ఆయన అల్లూరి సీతారామరాజుగా సిద్ధమయ్యే సమయంలో ఈ పాట వస్తుంది. 

ఆ సీన్‌లో ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ ఈ పాట రైటర్‌ శివ శక్తి దత్తాకి నచ్చకపోవడం గమనార్హం. 

55
`ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ సంచలన విజయం

రాజమౌళి రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ మూడేళ్ల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లని సాధించింది. సుమారు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1280కోట్లు వసూలు చేసింది.

 ఆస్కార్‌ అవార్డుతోపాటు ఆరు జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్‌ అవార్డులు, గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాలతోపాటు పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories