Sita Ramam Twitter Review: సీతా రామం సినిమా ట్విట్టర్ రివ్యూ, దుల్కర్ టాలీవుడ్ లో పాగా వేసినట్టేనా..?

First Published | Aug 5, 2022, 5:38 AM IST

మళయాళ హీరో అయినా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు దుల్కర్ సల్మాన్. టాలీవుడ్ లోడబ్బిగ్ మూవీస్ తో ఎంటర్ అయిన దుల్కర్ కు అవి బాగా కలిసి వచ్చి..తెలుగులో రొమాంటిక్ హీరో ఇమేజ్ తో పాటు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ అటాక్ ఇవ్వబోతున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో సీతారామం సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు దుల్కర్. 

సూపర్ హ్యాండ్సమ్ హీరో అనిపించుకున్నాడు దుల్కర్ సల్మాన్.. ఇక  ఇప్పుడు టాలీవుడ్ లో  డైరెక్ట్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే.. సీతారామం సినిమాలో తెలుగు ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు  దుల్కర్ సల్మాన్. ఇంటెన్స్ లుక్స్ తోనే, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ వస్తున్నాడు మలయాళ స్టార్. 

హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ తో పాటు మృణాల్  ఠాకూర్ , సుమంత్, మరియు ప్రత్యేక పాత్రలో.. సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా నటించారు. సౌత్ ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈమూవీ ఈరోజు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతుంది.  సీతారామం యుద్దం రాసిన ప్రేమ కథ క్యాప్షన్ తో తెరకెక్కిన ఈ మూవీ.. ఈరోజు (05 అగష్ట్) రిలీజ్ అవుతోంది. అయితే ఈమూవీ ముందుగా ఓవర్ సిస్ లో ప్రిమియర్స్ తో సందడి చేసింది. 


సీతారామం సినిమా ప్రిమియర్ షో చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమ అభిప్రాయాలు శేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమా చూసిన మేజర్ ఆడయిన్స్ ఏమని ట్వీట్ చేశారు. సినిమా నచ్చిందా లేదా..? దుల్కర్ కు ఎన్ని మార్కులు పడ్డాయి. తెలుగులో ఈ మలయాళ హీరో ప్రభావం ఎంత..? టాలీవుడ్ లో యంగ్ స్టార్ సెట్ అయినట్టేనా చూద్దాం.

ఈ సినిమాను క్లాసిక్ రొమాంటిక్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు ఆడియన్స్.. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్  మధ్య కెమిస్ట్రీ అద్భుతం అంటున్నారు. అంతే కాదు సినిమా మ్యూజిక్ తో పాటు బిజీయం క్లాసిక్ టచ్ తో.. మైమరపిస్తోందంటూ.. ట్వీట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సినిమాటోగ్రాఫీ మైండ్ బ్లోయింగ్ అంటూ పోస్ట్ పెడుతున్నారు ఆడియన్స్.  ఖచ్చితంగా చాడాల్సిందే అంటున్నారు. 
 

ఇక మరో మూవీ లవర్ ట్వీట్ చేస్తూ.. అద్బుతాలు అరుదుగా జరుగుతాయి.. అవి జరిగినప్పుడే గుర్తించండి. అలాంటి అద్భుతమైన సినిమానే సీతారామం అంటూ.. ట్వీట్ చేశాడు. అంతే కాదు...ఎక్స్ పీరియన్స్ తో చెపుతున్నా.. కళ్లకు కనువిందు చేసే విజ్యూవల్స్, వినసొంపైన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. దానికి తగ్గట్టు నటీనటుల నటన.. కొన్ని సినిమాలు రేటింగ్స్ కు అతీతం అంటూ పోస్ట్ పెడుతున్నారు. 
 

ట్వీట్టర్ లో ఎక్కువగా ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. డైరెక్టర్ హను రాఘవపూడి అందాల రాక్షసి తరువాత మరోసారి అద్భుతం సృష్టించాడు అంటున్నారు. అందరూ ఈ సినిమాలో దుల్కర్ నటన, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ.. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. 
 

సీతారామం సినిమాను క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా అభివర్ణిస్తున్నారు ఆడియన్స్. సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడండి..మైమరచిపోతారంటూ.. రివ్యూస్ ఇస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ తో పాటు, మ్యూజిక్ మిమ్మల్ని సమ్మోహనపరుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుంది.. మిస్ అవ్వకుండా థియేటర్లోనే చూడండంటూ ట్వీట్ చేస్తున్నారు జనాలు. 
 

ఇక ఈసినిమా గురించి మైనర్ రివ్యూస్ ఎక్కువగా కనిపించడం లేదు. కాకపోతే  సినిమాలో లెన్తీ సీన్స్ ఉన్నాయంటున్నారు ఆడియన్స్, మరికొంత మంది మాత్రం ఈసినిమాను మణిరత్నం రోజా సినిమాతో పోల్చుతున్నారు. కొంత మంది ఈ సినిమా స్లో గా సాగుతుంది.. కొంత మందికి బోర్ కొట్టే అవకాశం ఉంది అంటున్నారు. స్లో నేరేషన్ కూడా ఈసినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ట్విట్టర్ జనాలు. 

ఎక్కువ మంది ఆడియన్స్ సీతా రామం సినిమాకు మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఈ సినిమాను క్లాసిక్ బ్లాక్ బస్టర్ గా అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాతో దుల్కర్ టాలీవుడ్ లో సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు చాలా కాలంగా హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ హను రాఘవపూడికి కూడా మళ్ళీ బ్రేక్ లభించినట్టే అనుకోవాలి. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి.. మన ఆడియన్స్ రెస్పాన్స్ ను బట్టి.. సీతా రామం ఏం తేల్చబోతోందో చూడాలి. 
 

Latest Videos

click me!