‘సినిమా నా డీఎన్ ఏ.. నాన్నే నాకు స్ఫూర్తి’.. మహేశ్ బాబు కూతురు సితార ఎమోషనల్ పోస్ట్

First Published | Oct 13, 2023, 1:41 PM IST

నా జీవితంలో ‘సినిమా’కు ప్రత్యేక స్థానం ఉందని, నాకు కేవలం చిత్రపరిశ్రమ కాదు.. నా డీఎన్ ఏలో భాగమంటూ... మహేశ్ బాబు కూతురు సితారా ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన తండ్రి, తాతకు డెడికేట్ చేస్తూ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.
 

స్టార్ కిడ్ గా సితారా ఘట్టమనేని (Sitara Ghattamaneni) తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నారిని చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటుంది. తాత, తండ్రికి తగ్గట్టుగానే ఆమె పలు కార్యక్రమాలు చేస్తూ.. ప్రత్యేకమైనే రోజుల్లోనూ స్పెషల్ పోస్టులతో ఆకట్టుకుంటోంది. 

ఈరోజు నేషనల్ సినిమా డే (National Cinema Day) సందర్భంగా తాత సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) మరియు తండ్రి మహేశ్ బాబు (Mahesh Babu) కు తన పోస్ట్ ను అంకితం చేసంది. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ ఫొటోను కూడా పంచుకుంది. ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.
 


వెండితెరపై అగ్రగామిగా నిలిచిన మా నాన్నకు తనకు తన తండ్రి ఎలా ఉండేవారో.. అలాగే నాకూ స్ఫూర్తిగా నిలిచారు.  లెజెండరీ ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ కృష్ణ.. మా తాతగారు మా అందరిపై ఇంతంటి గాఢమైన ప్రభావం చూపారు. ఆయన వారసత్వంలో భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా సోదరుడు, నా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.  
 

ఇక నా జీవితంలో ‘సినిమా’కు ప్రత్యేక స్థానం ఉంది. నాకు కేవలం చిత్రపరిశ్రమ కాదు.. నా డీఎన్ ఏలో భాగం. నా కుటుంబ సినీ ప్రయాణాన్ని ఇష్టపడే, ఆదరిస్తున్న మీ అందరికీ జాతీయ సినిమా దినోత్సవ శుభాకాంక్షలు.. అంటూ పోస్ట్ చేసింది. తాత, తండ్రి, సోదరుడు గౌతమ్, అమ్మ నమ్రతా ఓకే ఫ్రేమ్ లో ఉన్నఫొటోను పంచుకుంది. ఇక జాతీయ సినిమా దినోత్సవాన్ని 2022లో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) రూపొందించింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత సినిమా హాళ్లను తిరిగి తెరిచిన జ్ఞాపకార్థం MAI జాతీయ సినిమా దినోత్సవాన్ని ప్రారంభించింది. 
 

సితార పెద్ద కుటుంబంలో జన్మించడమే కాదు.. ఆ స్థాయికి తగ్గట్టుగానే నడుచుకుంటోంది. పలు సేవాకార్యక్రమాలనూ చేస్తూ పెద్ద మనస్సును చాటుకుంటోంది. ప్రస్తుతం స్కూలింగ్ చేస్తున్న సితార ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది. సినీ కెరీర్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. 

కొద్దిరోజుల కింద సితార ఓ ఇంటర్నేషనల్ కమర్షియల్ యాడ్ కూడా చేసి ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే.  2019లో, ఇంగ్లీష్ ఫాంటసీ చిత్రం ఫ్రోజెన్ 2కు తెలుగు వెర్షన్‌లో బేబీ ఎల్సా పాత్రకు సితార తన గాత్రాన్ని అందించింది. అలాగే ‘సర్కారు వారి పాట’లోనూ ‘పెన్నీ’ సాంగ్ లో తన డాన్స్ తో అదరగొట్టింది. 

Latest Videos

click me!