నిషా కళ్లు, ఊరించే పెదాలతో మత్తెక్కిస్తున్న నేహా శెట్టి.. రాధిక చీరకట్టుకు ఫిదా అవ్వాల్సిందే..

First Published | Oct 13, 2023, 11:58 AM IST

యంగ్ బ్యూటీ నేహా శెట్టి బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఫిదా చేస్తోంది. మరోవైపు గ్లామర్ తో నెటిజన్లపై అందాల మత్తు జల్లుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసి చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty)  బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రస్తుతం సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇక్కడే అవకాశాలు అందుకుంటూ వస్తోంది. ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. 
 

కన్నడ చిత్రం ‘ముంగరు మేల్ 2’తో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ‘మెహబూబా’ చిత్రంతో పూరీ జగన్నాథ్ ఈ ముద్దుగుమ్మను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత నేహా పలు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.


‘గల్లీ బాయ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాలతో అలరించింది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డీజీ టిల్లు’తో నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ‘రాధిక’ పాత్రలో ఓదిగిపోయింది. తన పెర్ఫామెన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. 
 

ఆ చిత్రం హిట్ అవ్వడంతో తెలుగులో యంగ్ హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది. రీసెంగానే ‘బెదురులంక2012‘, ‘రూల్స్ రంజన్’ చిత్రాలతో థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలకూ మంచి  రెస్పాన్స్ దక్కడం విశేషం. ఈ క్రమంలో నేహా సోషల్ మీడియాలో మరింత సందడి చేస్తోంది.

చీరకట్టులో దర్శనమిస్తూ అదరగొడుతోంది. అయితే రాధికగా డీజే టిల్లులో చీరకట్టులోనే అలరించింది. ఇక అదే స్టైల్లో తరుచూ శారీలో మెరుస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. గ్లామర్ మెరుపులతో క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ లో అట్రాక్ట్ చేస్తోంది.
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ అట్రాక్టివ్ శారీలో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, ట్రాన్స్ ఫరెంట్ శారీలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఊరించే పెదాలు, మత్తెక్కించే చూపులతో మంత్రముగ్ధులను చేసింది. అదిరిపోయే స్టిల్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇక నేహా నెక్ట్స్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!